పేపర్ ఫోటోలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోయింది. చివరకు ఆల్బమ్‌లు కూడా డిజిటల్‌వి వచ్చేశాయి. కూర్చుని పేజీలు తిరిగేసే అవసరం లేకుండా.. అలా గోడకు వేలాడి దీసి స్లైడ్‌షో ఆన్ చేస్తే చాలు.. వందల కొద్దీ ఫోటోలు అలా అలా మారిపోతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి. అలాంటి సరికొత్త డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌లనే సోనీ సంస్థ విడుదల చేసింది.
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని సోనీ ఇండియా తాజాగా సరికొత్త డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి రూ. 3,990 మొదలుకొని రూ. 8,990 ధరలలో లభ్యమవుతున్నాయి. ఈ ఫ్రేమ్‌లు కేవలం జ్ఞాపకాలను పదిలం చేయడమే కుండా గోడ ఘడియారం/క్యాలెండర్‌గా కూడా ఉపయోగపడుతాయి.
చవక ధరకు లభించ్ డీపీఎఫ్ - ఏ 710 అనే డిజిటిల్ ఫోటో ఫ్రేమ్ 7" అంగుళాల తెరను కలిగి ఉండి, 128 ఎంబీ ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యంతో లభిస్తుంది. ఇందులో 250 ఫోటోలను వరకూ భద్రపరచుకునే వీలుంది. దీని మెమరీ సామర్ధ్యాన్ని పెంచుకునే వీలు కూడా ఉంది. ఈ పరికరాన్ని యూఎస్‌బీ కేబుల్ ద్వారా పిసికు అనుసంధానించుకోవచ్చు.
ఇకపోతే డీపీఎఫ్ -డి అనే డిజిటిల్ ఫోటో ఫ్రేమ్ 10" అంగుళాల ఎల్‌సీడీ తెర కలిగి ఉండి, 2జీబీ నిక్షిప్త మెమరీ సామర్ధ్యంలో లభిస్తుంది. ఇందులో 4000కు పైగా ఫోటోలను భద్రపరచకునే వీలుంది. ఇంకా ఇది ఎస్‌డీ వీడియో, మ్యూజిక్ ప్లేబ్యాక్, మోనో స్పీకరు వంటి విశిష్టతలతో లభిస్తుంది. ఈ మోడల్స్ అన్నింటినీ రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌తో ఆపరేట్ చేయవచ్చు.