టెలికాం రంగ విఫణిలో పెను మార్పులు తీసుకురానున్న "రిల్"
, సోమవారం, 27 ఆగస్టు 2012 (18:10 IST)
రిల్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్), దేశ ప్రైవేట్ రంగంలో అతిపెద్ద సంస్థ. ఒకే రంగంలోనే కాక తమ సంస్థ పేరును నలుదిశలా వ్యాపింపజేసేలా రిల్ అధిపతి ముఖేష్ అంబాని తన వ్యాపార సూత్రాలతో, విలువలతో విఫణిలో వడివడిగా అడుగులు వేస్తున్నారు.రిటైల్ రంగం లోకి రంగంలో తన పాదం మోపి విఫణిలో తీవ్ర పోటిని నెలకొల్పిన సంస్థ రిల్, టెలికాం రంగంలోనూ తన దూకుడు ప్రదర్శించాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే 2జీ స్పెక్ట్రం వేలంలో కెరటాలను ఎగురవేస్తూ రిల్ సంస్థ ముందంజలో ఉంది. క్రెడిట్ సుస్సే నివేదిక ప్రకారం టెలికాం రంగంలో రిల్ యొక్క దూకుడు రెండు కీలక మార్పులు తేనుంది. అవేంటంటే... ప్రస్తుతం ఉన్న 2-జీ వేలంలో వివిధ కంపెనీల మధ్య తీవ్ర పోటి... మరొకటి టెలికాం రంగం విఫణిలో దీర్ఘకాలిక పోటిని పెంచడం.భారతదేశ బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ సేవలలో అతిత్వరలో మొట్టమొదటగా కొత్తతరం 4-జీ సేవలను అందించనున్న ఏకైక సంస్థగా రిల్ నిలువనుంది. 2-జీ స్పెక్ట్రం వేలంలో వివిధ కంపెనీలతో పోటిపడుతూ ముందంజలో ఉన్న రిలయన్స్ సంస్థ 2-జీ వేలంలో ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం 2-జీ వేలానికి విధించిన కనిష్ట మొత్తానికి అధిక శాతంలో బిడ్ నమోదు చేశినట్లుగా తద్వారా Reliance Industries Limited 2-జీ వేలంలో తీవ్ర స్థాయిలో పోటీనిస్తుందని తెలుస్తుంది.టెలికాం రంగంలో అగ్రస్థానంపై కన్నేసి రిల్ 2-జీ వేలాన్ని చేజిక్కించుకోవడం ద్వారా ఓ కొత్తతరం సేవలకు శ్రీకారం చుట్టనుంది. టెలికాం సేవలో ఒకేసారి డేటా సర్వీసులను, వాయిస్ సర్వీసులను రెండింటిని కలిపి సేవలందించడం ద్వారా రిల్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. యల్.టీ.ఈ అంచనా ప్రకారం ఈ సేవలతో మార్కెట్‌పై రూ. 4,162 కోట్ల లాభాలను ఆర్జించేలా సంస్థ భారీ మొత్తంలో రూ.13,875 కోట్లను ఖర్చుపెట్టనుందని అంచనా.రెండు సేవలను అనుసంధానించి వినియోగదారులకు అందించడం ద్వారా విఫణిలో రిల్ సంచలనాలు సృష్టించనుందని విశ్లేషకుల అంచనా. ఈ సేవలకై తక్కిన కంపెనీలు సగటు వినియోగదారుడిపై విధించే రేట్లకన్నా రిలయన్స్ తక్కువ రేట్లతో అతి ఎక్కువ వినియోగదారులతో తన మార్కెట్‌ను భారీస్థాయిలో పెంచుకుని టెలికాం రంగంలో పోటీ పడుతున్న కంపెనీలలో అగ్రగామిగా నిలిచేందుకు సన్నాహాలు చేపడుతుంది. క్రెడిట్ సుస్సే నివేదికలో పేర్కొన్న విధంగా కంపెనీ వర్గాలు ఈ కొత్తతరం సేవలను ప్రారంభదశలో రిల్ సంస్థ మార్కెట్ షేర్ల విలువను 6 శాతం వరకు పెంచి, ఐదో సంవత్సరానికి RIL సంస్థ షేర్ల విలువను ౩౦ శాతం వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. సారాంశం : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం రంగంలో అడుగు పెట్టడం ద్వారా విఫణిలో తీవ్ర పోటి తత్వాని నెలకొల్పనుంది. 2-జీ స్పెక్ట్రం వేలం పాటను రిల్ చేజిక్కించుకుని తద్వారా వినియోగదారులకు సరి కొత్త తరహాలో వాయిస్, డేటా సర్వీసులను అనుసంధానించి అందించడం ద్వారా టెలికామ్ రంగంలో తక్కిన కంపెనీలపై తన ఆధిక్యతను ప్రదర్శించనుంది.