Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"జూజూ"లకు "జో..జో" చెప్పి వచ్చేసిన చిలుక

Advertiesment
వొడాఫోన్
PTI Photo
PTI
'వొడాఫోన్' అనగానే మనకి వెంటనే గుర్తు వచ్చేవి "జూజూ"లు. అవేనండి! బెలూన్‌ ఆకారంలో, కోడిగుడ్డు తలతో, తెల్లటి రంగులో ఉండి వాటి బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలతో గత ఏడాదంతా వొడా ఫోన్‌ ప్రచారంలో కీలకపాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్న జూజూలు ఇప్పుడిక కొంత కాలం విశ్రాంతి తీసుకోనున్నాయి. వీటి స్థానంలో ఇప్పుడు కొత్తగా ఓ యానిమేటెడ్ చిలక దర్శనమివ్వబోతోంది.

''జూజూలను ప్రవేశపెట్టినప్పుడు అవి ప్రపంచంలో వింతగా గోచరించాయి. కాని ఇప్పుడు వాటికి ప్రజల నుంచి ఆదరణ తగ్గింది. అవి ప్రతి ఒక్కరికి ఇష్టమైనవే అయినప్పటికీ, మమ్మల్ని అవి ప్రతిసారి ఆశ్చర్యానికి గురి చేయలేవు.'' అని ఆగ్లివీ అండ్‌ మాథర్‌ (ఓ అండ్‌ ఎమ్‌) ప్రకటనల కంపెనీకి చెందిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌రావ్‌ అన్నారు. తాము రూపొందించిన జూజూలు భారత ప్రకటనల రంగంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆయన చెప్పారు.

జూజూలు వివిధ బహుమతులను అందుకోవడమే కాక వినియోగదారులకు, ప్రకటనకర్తలకు ఎంతగానో ప్రీతిపాత్రమయ్యాయి. ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ ఫేస్‌బుక్‌లో జూజూలకు దాదాపు ఆరులక్షలకు పైగా అభిమానులున్నారు. యుట్యూబ్‌లో కూడా లక్షల మంది ప్రేక్షకులు ఈ వీడియోలను వీక్షించారు. 2009లో ఐపీఎల్ మ్యచ్‌ల సందర్బంగా జూజూలు టెలివిజన్ ప్రకటనల ద్వారా ప్రేక్షకులు పరిచయం అయ్యాయి.

కాగా... వొడాఫోన్‌ కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు రూపాయల బోనస్‌కార్డు ప్రచారానికి ఒక యానిమేషన్‌ చిలుకను సృష్టించారు. ఈ చిలుకకు నటుడు బొమాన్‌ ఇరానీ గాత్రదానం చేశారు. ''జూజూలను ఎక్కువకాలం ప్రచారంలో ఉంచాలనుకోవడం లేదని, వాటిని మేము ప్రేమిస్తున్నామని, అదే సమయంలో వాటిని పదేపదే ఉపయోగించదలుచుకోలేదని.'' జూజూల తండ్రిగా పిలిచే అడ్మాన్‌ అన్నారు.

వొడాఫోన్‌ కంపెనీ అందించిన పలు వాల్యూ యాడెడ్‌ సర్వీసెస్‌(విఎఎస్‌)ల గురించి ప్రజలకు తెలియజేయడమే జూజూల ముఖ్య ఉద్దేశ్యం. అయితే తాజాగా రూపొందించిన ఈ బోనస్ కార్డు ప్రచారానికి ఇవి సరిపోవు. ''కంపెనీ కొత్తగా రూపొందించే సందేశాన్ని ప్రతిసారి ఓ కొత్త కోణంలో చూపించాలనుకుంటాం. ఇప్పడు రూపొందించిన బోనస్ కార్డు ప్రచారం కూడా అలాంటి వాటిల్లో ఒకటి. మరి ఇలాంటి వాటికి జూజూలు సరిపోవు. ఇది టారిఫ్‌కు సంబంధించిన ఉత్పత్తి కావడం వల్ల వేరే మార్గాన్ని ఎన్నుకున్నామని" రావు తెలిపారు.

ఈ విషయమై వొడాఫోన్‌ ఎస్సార్‌ ఇండియా మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనూరాధా అగర్వాల్‌ మాట్లాడుతూ ''జూజూలు బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాయని'' తెలిపారు. ''ఈ సమయంలో జూజూలు వినియోగించటం సరైన నిర్ణయం కాదు, ఇవి ప్రత్యేకమైనవి, వీటిని అన్ని సమయాల్లో అనవసరంగా ఉపయోగించుకుంటే వాటికి న్యాయం చేయలేమని, అంతే కాకుండా చెప్పాలనుకున్న సందేశాన్ని కూడా సరిగా అందించలేమని, కావున విభిన్నమైన అంశాలను ఆలోచిస్తున్నామని" ఆమె తెలిపారు.

మరి జూజూలను పూర్తిగా నిలిపి వేస్తున్నారా.. అన్న ప్రశ్నకు అనూరాధ సమాధానమిస్తూ.."జూజూలు ఎక్కడికి వెళ్లవని, కావల్సినప్పుడు తెరపైకి వస్తాయని, వినియోగదారులు వాటిని చాలా ప్రేమిస్తున్నారని, వీటిని తొలగించే ఆలోచన లేదని" తెలిపారు. అయితే చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారంలో కొత్తదనాన్ని తీసుకురావడం కోసం ప్రసిద్ధ మస్కట్‌లను కనుమరుగు చేసిన సంగతి తెలిసిందే.

ఉదాహరణకు ఎయిర్ ఇండియాకు చెందిన మస్కట్ "మహరాజ్", ఒనిడా కంపెనీ మస్కట్ "డెవిల్", ఏసియన్ పెయింట్స్ మస్కట్ "గట్టు" ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కంపెనీలో జరిగే మార్పుల వల్ల కావచ్చు, లేదా ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేయడం కోసం కావచ్చు తమ మస్కట్‌లను కంపెనీలు దూరం చేస్తున్నాయి. ఏదైతేనేం జూజూలు త్వరలోనే తిరిగి రావాలని, మనందరిని మళ్లీ ఆనందిపచేయాలని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu