తొలిసారి గూగుల్‌ని ఉపయోగించేవారు చాలామంది శోధన సమయంలో కొన్నిసార్లు యాక్సెస్ డినైడ్ (403- యాక్సెస్ డినైడ్) స్క్రీన్‌లను డెస్కటాప్‌పై గమనించే ఉంటారు. అటువంటి వాటిని చూసినప్పుడు పీసీకి గాని వారి శోధన చరిత్రకు ఇబ్బందులు వస్తాయేమోనని భయపడతారు. కాని కొన్నిసార్లు స్పామ్-బాట్, బ్లాక్ హ్యాట్ సియోస్‌ల ఆధునిక ఆపరేటర్లును మాత్రమే ఉపయోగించాలని గమనించాలి. కొన్ని శోధన చిట్కాలతో మీ శోధన ఫలితాలను మరియు SERP విశ్లేషణను మెరుగుపర్చుకోవచ్చు.
తెలుకోవలసిన విషయాలు..
•గూగుల్ శోధనలో webdunia బదులుగా WebDuNia అని టైప్ చేయవచ్చు. మీ శోధన టర్మ్‌లకు సంబంధించిన పేజీలను శోధించడానికి గూగుల్ సిద్ధంగా ఉంటుంది, అలాగే మీరు శోధించాలనే పదాల క్రమం సరియైనవిగా ఉండేలా చూసుకోవాలి. గూగుల్ శోధించే సమయంలో తరుచుగా వాడే “I” , “the” వంటి అక్షరాలు మినహాయించి శోధిస్తుంది. కాబట్టి మీకు అవసరమైన అక్షరాలతో ప్రయత్నిస్తే మీ శోధన సులభమౌతుంది. శోధన చేసే సమయంలో ఆపరేటర్లను ఉపయోగించాలి. ఆపరేటర్లలో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి.
బేసిక్ ఆపరేటర్స్ (+, -, OR, ” “, ~, *, ..), SEO-ఓరియంటెడ్ ఆపరేటర్స్, గూగుల్ కాలిక్యులేటకర్ గైడ్.
బేసిక్ ఆపరేటర్స్:
• ( - ) : ఖచ్చితమైన ఫలితాలను చూపించడానికి ఇతర శోధన పదాలన్నిటిని అడ్డుకుంటుంది. ఉదా:creamy doughnut బదులుగా doughnut -creamy అని శోధింధాలి.
• ( OR ): Donut లేదా Donut వంటి, ఇచ్చిన పదాలున్న పత్రాలను గూగుల్ శోధిస్తుంది. OR బదులుగా | ను కూడా ఉపయోగించవచ్చు, ఉదా.. doughnut | donut.
• ( ” “ ): ఖచ్చితమైన ఫ్రేస్‌ను మాత్రమే శోధించడానికి స్టాప్ అక్షరాలను ఉపయోగిస్తే, గూగుల్ మీరు ఇచ్చిన ఫ్రేస్ ఫలితాలను ఇస్తుంది. doughnut at midnight బదులు “doughnut at midnight” ఉపయోగిస్తే, ( ” “ )లో ఉన్న ఫ్రేస్‌లను చూపిస్తుంది.
**SEO-ఓరియంటెడ్ ఆపరేటర్స్:
•allintitle: టైటిల్ కోసం ఉదా:allintitle:doughnuts అని ఈ విధంగా శోధించాలి.
•intitle: టైటిల్‌తో పాటు సమాచారం కోసం intitle:doughnuts chocolate అని టైప్ చేసి శోధించాలి.
•allintext: ఉదా: allintext:doughnuts chocolate అని శోధిస్తే, ‘doughnuts’ మరియు ‘chocolate’ ఉన్న డాక్యుమెంట్‌ల ఫలితాలను చూపిస్తుంది.
•intext: ఉదా: intext:doughnuts chocolateను శోధిస్తే, doughnuts ఉన్న టెక్స్ట్‌ను ఇంకా chocolate గురించి పేర్కొన్న సమాచారాన్ని చూపిస్తుంది.
**అధునాతన గూగుల్ ఆపరేటర్స్:
•డేట్ రేంజ్:
ఇచ్చిన టైమ్ ఇంటర్‌వెల్‌తో మోడిఫై చేసిన డాక్యుమెంట్‌లను మీ శోధన ఫలితాలలో చూపిస్తుంది. తేదీలు జులియన్ ఫార్మాట్‌లలో ఉండేలా చూసుకోవాలి.
•ఫైల్ టైప్:
ఇచ్చిన ఫైల్ రకాలతో డాక్యుమెంట్ లింక్‌లను చూపిస్తుంది. ఉదా: doughnuts filetype: జావా పోర్టబుల్ మరియు ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ doughnutలను గూగుల్ శోధిస్తుంది. ప్రస్తుతం అధికారికంగా సపోర్ట్ చేసే ఫైల్ రకాలు: pdf, ps, wk1, wk2, wk3, wk4, wk5, wki, wks, wku, lwp, mw, xls, ppt, doc, wks, wps, wdb, wri, rtf, swf, ans, txt, కాని xml, cpp, java మొ.. కూడా ఇతర ఫైల్ ఫార్మాట్‌లుగా శోధిస్తుంది.
•stoks: స్టాక్‌లను శోధించడానికి stocks:goog అని శోధించాలి.
•weather: weather:los angeles అని శోధిస్తే, మీకు ఆ దేశపు వాతావరణ విశేషాలను చూపిస్తుంది.
•movie: ఉదా: movie:india, movie:nyc, movie 10015లతో శోధించాలి.
•flights: ఫ్లైట్స్ కోసం ఉదా: jfk lax (ఎయిర్ పోర్ట్ కోడ్‌ను సమర్పించాలి).
***గూగుల్ కాలిక్యులేటర్ గైడ్: (+ - * / % ^)
•నిర్ధిష్టమైన చిహ్నాలతో మీరు గూగుల్‌ను కాలిక్యులేటర్‌గా కూడా ఉపయోగించవచ్చు, ఉదా..3+2ని గూగుల్‌లో శోధిస్తే, 3+2=5గా సమాధానాన్ని చూపిస్తుంది. అధే విధంగా 4-1ని '4-1=3'గా చూపిస్తుంది. ఈ విధంగా ఇతర కాలిక్యులేటర్ ఆపరేటర్లను ఉపయోగించి సమాధానాలను పొందవచ్చు.
•గూగుల్ ఎక్కువ కన్వెర్షన్ టూల్‌లను సపోర్ట్ చేస్తుంది:
మీరు గూగుల్ శోధనను ఉపయోగించి రేడియన్స్‌ను డిగ్రీలుగా మార్చుకోవచ్చు: pi/2 డిగ్రీలు లేదా డిగ్రీలను రేడియన్స్‌లోకి మార్చుకోవచ్చు: రేడియన్స్‌లో 90 డిగ్రీలు.
*అదేవిధంగా డిస్టెన్స్ కన్వెర్షన్‌లను ఉపయేగించి స్పీడ్, టైమ్, టెంపరేచర్లకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ శోధనలో సమాధానాలను పొందవచ్చు.