హైదరాబాద్‌లో ఎన్‌విడియా విజువల్ కంప్యూటింగ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. హైదరాబాదుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), విజువల్ కంప్యూటింగ్ టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన ఎన్‌విడియా కార్పొరేషన్‌లు సంయుక్తంగా ఈ ల్యాబ్ ప్రారంభించాయి.ఈ ల్యాబ్‌లో శిక్షణ పొందే విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ లైసెన్సులు అందజేస్తారు. అలాగే జీపీయు ఇంజినీరింగ్, విజువల్ కంప్యూటింగ్ రంగాల్లో పరిశోధన చేయడం వంటి అంశాలలోను శిక్షణనిస్తారు. ఇంకా గ్రాఫిక్స్ టెక్నాలజీలో అత్యధునాతన విద్యను అందజేస్తూ అందులో గల అవకాశాలను విద్యార్థులకు తెలిపి అవగాహన కల్పిస్తారు.విజువల్ కంప్యూటింగ్ ల్యాబ్ |
|
సీయుడీఏ వంటి అధునాతన జీపీయు టెక్నాలజీలతో పాటు ఆధునిక ఇంజనీరింగ్‌పై మరింతగా పరిశోధించే అవకాశాలను అందించే ఈ ల్యాబ్ విద్యార్థులకు, ఫ్యాకల్టీకి గొప్ప ఆస్తి జెన్ అవుతుందన్నారు. |
|
|
హైదరాబాద్‌లో విజువల్ కంప్యూటింగ్ ల్యాబ్ ప్రారంభించిన సందర్భంగా ఎన్‌విడియా సంస్థ అధ్యక్షుడు, సీఈఓ జెన్ సన్ హువాంగ్ మాట్లాడుతూ... ఈ ల్యాబ్ ప్రారంభంతో ఇరు సంస్థల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడినట్లు తెలిపారు. సీయుడీఏ వంటి అధునాతన జీపీయు టెక్నాలజీలతో పాటు ఆధునిక ఇంజనీరింగ్‌పై మరింతగా పరిశోధించే అవకాశాలను అందించే ఈ ల్యాబ్ విద్యార్థులకు, ఫ్యాకల్టీకి గొప్ప ఆస్తి అవుతుందన్నారు.
ఈ ల్యాబ్ సహాయంతో సీయుడీఏ పారెలెల్ ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్స్ సామర్థ్యాలను హైదరాబాద్ ఐఐఐటీ స్పష్టంగా అవగాహన చేసుకొని సరైన విధంగా ప్రయోగాలను నిర్వహించగలుగుతుందని చెప్పారు. దేశంలోని ప్రధాన సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐఐటీతో సంయుక్తంగా ఈ ల్యాబ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని జెన్ వ్యాఖ్యానించారు.
ఇక ఐఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ పీజే నారాయణ్ మాట్లాడుతూ ఎన్‌విడియా సంస్థతో తమ బంధం రెండేళ్ల నుంచి కొనసాగుతోందని తెలిపారు. అలాగే జీపీయూ టెక్నాలజీకి సంబంధించి తాము అత్యున్నత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్‌విడియా గురించి....
జీపీయు టెక్నాలజీని కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌విడియా సంస్థ విజువల్ కంప్యూటింగ్ టెక్నాలజీని అందిస్తున్న సంస్థల్లో అగ్రస్థాయి కంపెనీ ఎన్‌విడియా తన జీఫోర్స్ ఉత్పత్తులతో వినోదం మరియు వినియోగదారుల మార్కెట్‌కు సేవలను అందజేస్తుంది. క్వాడ్రో ఉత్పత్తుల ద్వారా డిజైనింగ్, విజువలైజేషన్ మార్కెట్‌లకు, టెల్సా ఉత్పత్తుల ద్వారా అత్యున్నత ప్రమాణాలు కలిగిన కంప్యూటింగ్ మార్కెట్లకు తన సేవలను అందిస్తుంది.
కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌విడియా సంస్థ ఆసియా, యూరప్, అమెరికాలలోని దాదాపు అన్ని దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.