Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ- వ్యర్థాలతో యమ డేంజర్

Advertiesment
కంప్యూటర్
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2010 (17:11 IST)
కంప్యూటర్‌తో పని చేయడం వలన కాగితపు ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. కాని ఒక్క భారతదేశంలో మాత్రమే రానున్న 2020 నాటికి వాడిపడేసిన కంప్యూటర్లు 2007కంటే దాదాపు ఐదువందల శాతం పెరిగిపోతాయని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది.

విద్యుత్ పరికరాల ద్వారా ఉపయోగించే ఉపకరణాలు వ్యర్థపూరితమైన వాటికి కొత్త పేరును కనుకొన్నారు. అదే ఈ-వేస్ట్ లేదా ఎలక్ట్రానిక్ వ్యర్థం. ఇందులో కంప్యూటర్‌తోపాటు టెలివిజన్, ఫ్రిజ్, ప్రింటర్, టెలిఫోన్‌తోపాటు ఇతర గృహోపకరణాలున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల టన్నుల మేరకు ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

సమస్య ఎక్కడుందంటే ఈ-వ్యర్థాలను వేరు చేసి వాటిని వేడిచేసి బంగారు, రాగిలాంటి ధాతువులతో తయారు చేసేపదార్థాలను తయారు చేసేందుకు వినియోగించినప్పుడు సమస్యలు ఉత్పన్నమౌతాయంటున్నారు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ కార్యనిర్వాహక డైరెక్టర్ ఆఖిం ష్టైనర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా, భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాలతోపాటు ఇతర దేశాలలోను ఈ-వ్యర్థాల ద్వారా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. చెత్త సేకరించే వారికి ఇలాంటి పదార్థాలను అప్పగిస్తే ఆరోగ్యానికి మరింత ప్రమాదమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూనెప్‌‌తోపాటు స్విట్జర్‌లాండ్‌కు చెందిన సంస్థ ఈఎమ్‌పీఏ, యూమీకోర్ కంపెనీ, ఐరాస విశ్వవిద్యాలయం కూడా ఈ నివేదికను ధృవీకరించింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు అమెరికాలో విడుదలౌతున్నాయని దీంతో ఆ దేశం ప్రథమ స్థానంలోవుందని నిపుణులు తెలిపారు. అదే రెండవ స్థానంలో చైనా దేశం ఉందని, ఆ దేశం ప్రతి ఏడాది 23 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలను విడుదల చేస్తోందన్నారు.

కంప్యూటర్లే కాకుండా సెల్‌ఫోన్‌లు కూడా ఈ-వ్యర్థపదార్థాలలో భాగమైపోయాయి. చైనాలో 2007తో పోలిస్తే వచ్చే 2020 నాటికి దాదాపు ఏడింతల సెల్‌ఫోన్‌లు ఈ-వ్యర్థపదార్థాల కోవలోకి చేరిపోతాయి. అదే భారతదేశంలో ఈ లెక్కలు పద్దెనిమిదింతలు పెరిగిపోతాయి.

ఇదిలావుండగా స్వచ్ఛంద సంస్థ అయిన బాసేల్ యాక్షన్ నెట్‌వర్క్‌కు చెందిన జిమ్ పాకెట్ అందించిన వివరాల మేరకు అమెరికా నుంచి ఒక ఓడలో ఈ-వ్యర్థాలను ఇండోనేషియాకు ఇటీవలే తరలించారు. ఇందులో పాత టెలివిజన్లకు చెందిన పిక్చర్ ట్యూబులు, కంప్యూటర్లకు చెందిన స్క్రీన్‌‍లున్నాయి. ఇవన్నింటినీ ప్రజలు ఇప్పుడు వాడేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలు ఫ్లాట్ స్క్రీన్‌లను వాడుతున్నారు.

వీటికి పరిష్కార మార్గాలు కూడా నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే పేద దేశాల నుంచి బ్యాటరీలు, విద్యుత్ పరికరాలు, సర్క్యూట్ బోర్డులను అభివృద్ధి చెందిన దేశాలకు తరలిస్తే వాటిని అక్కడ భద్రపరుస్తారు.

Share this Story:

Follow Webdunia telugu