Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపిల్ కంపెనీ కొత్త ఐఫోన్.. చౌక ధరలోనే!

Advertiesment
ఐటీ
FileFILE
ప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ రంగ సంస్థ ఆపిల్ కంపెనీ త్వరలో కొత్త ఐఫోన్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఇలాంటి తరహా ఫోన్‌లకు బాగా ఆదరణ పెరగడంతో.. వీడియో కెమేరాతో కూడిన ఈ ఐఫోన్ ఇతర ఐఫోన్‌ల కన్నా తక్కువ ధరకే అందించనున్నట్లు ఆపిల్ తెలిపింది.

శాన్‌ ఫ్రాన్సిస్కోలో ప్రపంచవ్యాప్త డెవలపర్ల వార్షిక సదస్సులో ఆపిల్ కంపెనీ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు ఫిల్ స్కిల్లర్ సరికొత్త ఐఫోన్‌ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఐఫోన్ త్రీజీఎస్‌గా విడుదలయ్యే ఈ మోడల్లో వీడియో తీసుకునే సౌలభ్యాన్ని కల్పించామన్నారు.

త్రీజీఎస్‌లో 'ఎస్' అంటే వేగానికి సంకేతంగా స్కిల్లర్ అభివర్ణించారు. ఎందుకంటే... అత్యంత శక్తివంతంగా.. వినియోగదారుల అభిరుచికి సరిపోయే విధంగా.. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా.. ఈ ఫోన్‌ ఉంటుందని స్కిల్లర్ వివరించారు. 16-గిగాబైట్ ఐఫోన్ త్రీజీఎస్ ధర 199 డాలర్లు, కాగా, 32- గిగాబైట్ మోడల్ ధర 299 డాలర్లు మేరకు ఉంటుంది. అలాగే ఒరిజినల్ ఎయిట్-గిగాబైట్ ఐఫోన్ త్రీజీ ధర 99 డాలర్లకే లభిస్తుందన్నారు.

ఈ కొత్త ఐఫోన్‌లో ఫీచర్స్..

ఇంతకుముందు చెప్పినట్లు వీడియో కెమేరా ఇందులో ప్రత్యేక సదుపాయం. వాయిస్ కమాండ్‌తో కూడిన 3.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఈ ఐఫోన్‌లో రెంటెడ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. అలాగే అరబిక్, హెబ్రూ, కొరియన్ తదితర అదనపు భాషలను కూడా వ్యక్తిగత సెట్టింగుల్లో అమర్చుకోవచ్చు. దీనికి తోడు ఈ కొత్త ఐఫోన్‌లో 'ఫైండ్ మై ఐఫోన్' అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఈ ఫీచర్ వల్ల ఐఫోన్ చోరీకి గురైనా లేదా ఎక్కడైనా మిస్ అయినా సరే.. ఆపిల్ ఆన్‌‌లైన్ సర్వీసు ద్వారా మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చని స్కిల్లర్ తెలిపారు. అలాగే చోరీకి గురైన వెంటనే ఐఫోన్‌లో సమాచారాన్నంతా రిమోట్ తరహాలో తీసివేయవచ్చన్నారు.

కాగా, చక్కటి క్వాలిటీ వీడియో ఉన్న ఈ ఐఫోన్‌ను జూన్ 19న విడుదల చేయనున్నామని స్కిల్లర్ తెలిపారు. అదే విధంగా స్మార్ట్‌ఫోన్ యజమానులు తమ ఫోన్ అప్‌గ్రేడ్ కోసం జూన్ 17న నెక్స్‌ట్ జనరేషన్ ఐఫోన్ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామని స్కిల్లర్ ప్రకటించారు.

గతంలో...
నిజానికి ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని మొబైల్‌లలో రేడియో కనీస ఫీచర్‌గా ఉంటోంది. కానీ ఖరీదైన ఈ ఐఫోన్‌లో మాత్రం అలాంటి సౌలభ్యం లేదు. అయినప్పటికీ మార్కెట్లో ఈ ఐఫోన్ లాభాలను పండిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహణ.. ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ మరియు ఐపాడ్ టచ్ పరికరాలు ఈ ఏడాది ఏప్రిల్‍‌లో 40 మిలియన్‌లకు పైగా అమ్ముడుపోయాయి. అలాగే ఇదే నెలలో ఒక బిలియన్‌కు పైగా ఈ ఫోన్‌ అప్లికేషన్‌లు అమ్ముడు పోవడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu