Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్‌ యూజర్లూ.. జర జాగ్రత్త! మొబైల్‌ థ్రెట్స్‌లో భారత్ స్థానమేంటి?

Advertiesment
smartphone threats
, బుధవారం, 20 జనవరి 2016 (08:35 IST)
దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నానాటికీ పెరిగిపోతున్నారు. అదేసమయంలో సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఫలితంగా మొబైల్ థ్రెట్స్ సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు యాంటీ వైరస్ తయారీ సంస్థ వెల్లడించిన 'కాస్పర్‌ స్కై' తన తాజా నివేదికలో పేర్కొంది.
 
అదేసమయంలో మొబైల్‌ థ్రెట్స్‌ బారిన పడటంలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో ఉందని.. ఆ మేరకు వినియోగదారులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరముందని హెచ్చరించింది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు, మాల్‌వేర్‌ దాడులు, సమాచార దోపిడీ జరిగే ప్రమాదం పెరుగుతోంది. 
 
ఈ మధ్య ఆన్‌లైన్‌ షాపింగ్‌, బిల్లులు చెల్లించడం, ఆర్థిక లావాదేవీల కోసం మొబైల్‌ ఫోన్లపైనే ఎక్కువమంది యూజర్లు ఆధారపడుతున్నారు. మీ ఆర్థిక లావాదేవీలు.. సైబర్‌ నేరగాళ్లు.. హ్యాకర్ల దాడికి లోనవకుండా ఉండాలంటే.. మొబైల్‌ ఫోన్లలో వెంటనే మరింత రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ‘కాస్పర్‌ స్కై’ దక్షిణాసియా ఎండీ ఇటాఫ్‌ హల్దే తెలిపారు. సో స్మార్ట్‌ యూజర్లూ.. బీకేర్‌ఫుల్‌!

Share this Story:

Follow Webdunia telugu