Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్యామ్‌సంగ్.. గెలాక్సీ నోట్ 8 రిలీజ్: కానీ విమానాల్లో గెలాక్సీ నోట్ 7కి నో పర్మిషన్.. ఎందుకు?

స్మార్ట్ ఫోన్ల హవా అంతా ఇంతా కాదు... ఇంటర్నెట్‌ చౌకగా లభించడంతో తినడానికి అన్నం లేకపోయినా.. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగంతో కొంత మేలున్నప్పటికీ.. కీడు అ

Advertiesment
Samsung Galaxy On8 likely to debut during Flipkart's Big Billion Day in India
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:55 IST)
స్మార్ట్ ఫోన్ల హవా అంతా ఇంతా కాదు... ఇంటర్నెట్‌ చౌకగా లభించడంతో తినడానికి అన్నం లేకపోయినా.. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగంతో కొంత మేలున్నప్పటికీ.. కీడు అంతకంతకు రెడింతలు ఎక్కువగా ఉండటంతో.. విమానాల్లో స్మార్ట్ ఫోన్లను అనుమతించేది లేదు. ముఖ్యంగా శ్యామ్ సంగ్‌ కొత్త గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్‌ను విమానాల్లోకి అనుమతించేది లేదని తెలిసింది. 
 
ఈ నెల 15వ తేదీకి ముందు ఉత్పత్తి చేసిన తమ ఫోన్లను భారతీయ కస్టమర్లకు అమ్మబోమని శ్యామ్‌సంగ్ సంస్థ పౌర విమానయాన సంస్థ-డీజీసీఎకి హామీ ఇచ్చింది. తమ కొత్త ఫోన్లకు తెల్ల రంగు బదులు.. గ్రీన్ కలర్ బ్యాటరీ ఇండికేటర్లు ఉంటాయని, ఇవి విమాన ప్రయాణికులకు భద్రతా పరంగా వెసులుబాటునిస్తాయని తమకు హామీ ఇచ్చినట్టు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.
 
విమానాల్లో ప్రయాణిస్తున్న వారు శ్యాం సంగ్ గెలాక్సీ 7 నోట్‌ను తీసుకువెళ్ళరాదన్న సూచనను తిరిగి పరిశీలించాలని ఈ సంస్థ కోరినట్లు తెలుస్తోంది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ల భద్రతపై అనుమానాలు తలెత్తడంతో పౌరవిమానయాన సంస్థ ఈ సంస్థకు కొన్ని సూచనలు చేసింది. ఇకపై కొత్త ఫీచర్లతో తయారు చేసిన వాటినే మార్కెట్‌లో విడుదల చేస్తామని శ్యామ్‌సంగ్ హామీ ఇచ్చింది.
 
భారత మార్కెట్లోకి శ్యామ్‌సంగ్.. గెలాక్సీ నోట్ 8 రిలీజ్.. 
భారత మార్కెట్లోకి శ్యామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 రిలీజ్ కానుంది. ఈ నెల 28న శ్యామ్‌సంగ్.. గెలాక్సీ నోట్ 8 మోడల్ విడుదల కానుంది. ఈ మోడల్‌ కర్వ్ డిప్లే ప్యానల్ కలిగివుంటుంది.  
 
* గెలాక్సీ 8 మోడల్‌లో USB Type-C port ఆడియో ఉంటుంది.
* 8895 బ్రౌజర్ ఉంటుంది. 3.0GHz సామర్థ్యంతో ఈ బ్రౌజర్ అత్యంత వేగంగా పనిచేస్తుంది. 
* గెలాక్సీ నోట్ 7లో 6 జీబీ మాత్రమే ఉండగా, 8లోనూ అదే సామర్థ్యంతో కూడిన 6జీబీ రామ్ మాత్రమే ఉంటుందని సమాచారం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా...! వ‌రుస‌గా 5 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు... ఐనా ఆ రోజు పనిచేస్తార‌ట‌!