ఈ యేడాది రెండో త్రైమాసికంలో ఇండియా పీసీలు మార్కెట్ మొత్తంపై 8.1 శాతం అభివృద్ధితో ముందుకు సాగుతున్నాయి. 2.085 మిలియన్ల ఎగుమతులు సాధించింది. ఇది 2007 రెండో త్రైమాసిక ఫలితాలతో పోల్చినపుడు ఈ పురోగతి కనిపించింది. అందరు పీసీ వినియోగదారుల మార్కెట్‌ను గమనిస్తే, హెచ్‌పీ 18.7 శాతం ఉంది. అదే విధంగా హెచ్‌సీఎల్ రెండో స్థానంలో ఉంది.
రెండో త్రైమాసికంలో డెల్ సంస్థ మూడో స్థానంలో నిలచింది. డెస్క్ టాప్ పీసీల విషయానికి వస్తే హెచ్‌పీ 13.9 శాతంతో మొదటి స్థానంలో నిలచింది. హెచ్ సీ ఎల్, డెల్‌లు వరుసగా రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి. భారత ఆర్థిక పెరుగుదలలో 7.5 నుంచి 8.0 శాతం పెరుగదలకు కారణమయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రాజకీయ సంక్షోభ సమయంలో కూడా ఇండియా పీసీల అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదని ఐడిసీ ఇండియా మేనేజర్ కపిల్ దేవ్ సింగ్ తెలిపారు. ఇండియాకు చెందిన పీసీ అమ్మకం దారులు తక్కువ ధరకు నోట్ బుక్ పీసీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇవి బ్రాడ్ బాండ్ కనెక్టవిటీని కలిగి ఉన్నాయి. ఇలా పీసీల తయారీలో భారతదేశం ముందంజలో ఉంది.