3జీ మొబైల్ ఫోన్ ప్రత్యేకతలేంటంటే...
, గురువారం, 20 మే 2010 (19:24 IST)
వచ్చే ఆరు నెలల కాలంలో మూడవ తరానికి చెందిన (3జీ) ఫోన్లు దేశీయ మొబైల్ మార్కెట్‌లో ఊపందుకోనున్నాయి. ఆ తర్వాత అదే ఫోన్ మీ జేబుల్లోకి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మీరు వాడే మొబైల్ ఫోన్ 2జీకి సంబంధించింది. ఈ ఫోన్ ద్వారా సందేశం పంపించాలనుకుంటే ఆకాశంలోకి మూడు కిలోహెట్జ్ బ్యాండ్ విడ్త్ అవసరం ఉంటుంది. ఇందులో కేవలం శబ్ద తరంగాలను మాత్రమే మీరు పొందగలుగుతున్నారు. అదే 3జీ ఫోన్లలో 15 నుంచి 30 మెగా హెట్జ్ బ్యాండ్ విడ్త్ అవసరం అవుతుంది. అంటే శబ్ద తరంగాలతోపాటు వీడియోలను తిలకించే అవకాశాలు కలుగుతాయి. 3జీ సేవలు వస్తే మీ మొబైల్‌లో ఎలాంటి సేవలను మీరు పొందవచ్చనే దానిపై దృష్టి సారిస్తాం...* మొబైల్‌లో టీవీ3
జీ సేవలు కలిగిన మొబైల్‌లో మీకిష్టమైన టీవీ కార్యక్రమాన్ని తిలకించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడే టీవీ చూసేందుకు వీలు కలుగుతుంది. కాని 3జీ మొబైల్ సేవలున్న ఫోన్ మీవద్ద ఉంటే మీరు ఎక్కడున్నా టీవీ కార్యక్రమాలను చూసే సౌకర్యం ఉంటుంది. కేవలం టీవీ కార్యక్రమాలే కాకుండా ప్రత్యేక వార్తలను కూడా చూడవచ్చు. అలాగే కారులో ప్రయాణిస్తూ మొబైల్ ఫోన్‌లో టీవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను తిలకించవచ్చు.* మొబైల్ ఫోన్‌లో సినిమాలురేడియోలో మీకు నచ్చిన పాటలను వినే అవకాశం పాతపద్ధతి. కాని 3జీ ఫోన్ మీ చేతిలోవుంటే మీరు చూడాలనుకున్న సినిమాను పూర్తిగా చూసే సౌకర్యం కలుగుతుంది. దీనికి మీరు అదనంగా రుసుము చెల్లించాల్సివుంటుంది. * 3జీ మొబైల్ ద్వారా పూర్తి భద్రత
మీ ఇంట్లో 3జీ కెమెరాను ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఏం జరుగుతుందో మీ మొబైల్ సహాయంతో చూసే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఏర్పాటు చేసిన డోర్ వీడియో కెమెరాకూడా పాతదైపోతుందన్నమాట. * మొబైల్ మెడిసిన్3
జీ మొబైల్ ఫోన్ మీ చేతిలో వుంటే మీరు మీ వ్యక్తిగత వైద్యుడిని మొబైల్ ద్వారానే కలుసుకోవచ్చు. మీకు కావలసిన ఔషధం గురించి తెలుసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడి నుంచైనా మీ వ్యక్తిగత వైద్యుడి నుంచి వైద్య సలహాలను పొందవచ్చు. లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలోనున్న వైద్యుడి సలహాలను పొందే సౌకర్యం కలుగుతుంది. * మొబైల్‌లో వీడియో కాన్ఫరెన్స్ ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కలిగిన వ్యక్తులతో మాట్లాడే సమయంలో ఒకరినొకరు చూసుకునే సౌకర్యం ఉంటుంది. ఇది వరకు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ అని అంటువున్నారో... అది ఇప్పుడు మీ మొబైల్ ఫోన్‌లో వస్తోందన్నమాటమీవద్ద డబ్బులుంటే మీ ఫోన్ మీ జీవితాన్నే మార్చేస్తుంది... ప్రపంచవ్యాప్తంగానున్న 40 దేశాల్లో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే అవలంబించాయి. ప్రపంచంలోని 300 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులున్నారు. వీరిలో కేవలం 15-20 కోట్లమంది మాత్రమే 3జీ సేవలు కలిగిన మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. కాని జపాన్, కొరియా దేశాల్లో ప్రతి వంద మంది మొబైల్ వాడకందార్లలో 70 మంది 3జీ సేవలు కలిగిన మొబైల్ ఫోన్లను వాడుతున్నారు.ఇదిలావుండగా అక్కడి టెలికాం కంపెనీలు ఇప్పుడు తాజాగా 4జీ మొబైల్ ఫోన్ల నిర్మాణానికి శ్రీకారంచుడుతున్నాయి.