భారతదేశ అంతర్జాల(ఇంటర్నెట్) వినియోగదారుల సంఖ్య భారీగా పెరగనుంది. 2015 నాటికి భారత ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 237 మిలియన్లకు చేరనుంది. ప్రస్తుతం భారత ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 81 మిలియన్లుగా ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ "ఇంటర్నెట్స్ న్యూ బిలియన్" అనే పేరుతో నిర్వహించిన ఓ అధ్యయనంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, ఇండోనేషియా దేశాలు 2015 నాటికి 1.2 బిలియన్ యూజర్లను నమోదు చేసుకుంటాయని తెలిపింది.
గత 2009లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, ఇండోనేషియా దేశాలు 610 మిలియన్ ఇంటర్నెట్ యీజర్లను కలిగి ఉన్నట్లు ఆ గ్రూపు ప్రకటించింది. భవిష్యత్ తరాలు, యువత అంతర్జాల ఉపయోగాన్ని మరింతగా వినియోగించుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ దేశాలు వార్షికంగా 9శాతం నుంచి 20శాతం వరకూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తెలిపింది.