Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోషల్ మీడియా ప్రభంజనం... ఆసక్తికర అంశాలు...!!

సోషల్ మీడియా ప్రభంజనం... ఆసక్తికర అంశాలు...!!
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2013 (23:12 IST)
PR
పింటెరెస్ట్ ఫీచర్లు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ తన వెబ్ వెర్షన్‌ను ప్రారంభించింది. ఇక ఫేస్‌బుక్ తన అడ్వర్టైజింగ్ ఆఫ్షన్లను క్రమంగా విస్తరించుకుంటూ వెళుతోంది. ఇలా చూసినప్పుడు భవిష్యత్తంతా సోషల్ మీడియాతో ముడివడిపోతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కనుక వీటికి సంబంధించిన అంశాలను మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది.

ఇది తెలుసుకునేముందు అసలు ఒక్కో సోషల్ చానల్ వెనుక ఉన్న విషయం అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు సంబంధించి ఇపుడు మనకు తెలిసిన దానికంటే మరికొన్ని సంగతులను తెలుసుకుంటే భవిష్యత్తులో వాటిని ఎలా వినియోగించుకోవాలన్న విషయమై మనకు ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. అందుకే మీకోసం ఈ సంగతులు...

1. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బరాక్ ఒబామా ఫేస్‌బుక్ పోస్ట్ ఫేస్‌బుక్‌లో అత్యంత జనాదరణ కలిగినదిగా సుమారు 40 లక్షల లైక్స్‌తో నిలిచింది(Source: The Huffington Post)

2. ఫేస్‌బుక్‌ లో 25 శాతం మంది ఎలాంటి ప్రైవసీ చట్టాల గురించి అస్సలు పట్టించుకోరు.(Source: AllTwitter)

3. ఒక్కో ఫేస్‌బుక్‌ యూజర్ సరాసరి 130 మంది ఫ్రెండ్స్‌ను కలిగి ఉన్నాడు. (Source: AllTwitter)

4. నెలవారీ యాక్టివ్ యూజర్స్ సుమారుగా 850 మిలియన్లుకు చేరుకున్నారు. (Source: Jeff Bullas)

5. ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్న 21 శాతం మంది యూజర్లు ఆసియాకు చెందినవారు కావడం గమనార్హం(Source: Uberly)

6. 488 మిలియన్ యూజర్లు క్రమంగా ఫేస్ బుక్ మొబైల్‌ను ఉపయోగిస్తున్నారు.(Source: All Facebook)

7. ప్రపంచ దేశాలన్నిటికీ బ్రెజిల్ దేశం అత్యధిక ఫేస్‌బుక్ పోస్టులను చేస్తుంటుంది. నెలకు సుమారు 86 పోస్టులు ఈ దేశం నుంచి పోస్ట్ చేయబడుతుంటాయి.(Source: Socialbakers)

8. ఫేస్‌బుక్‌ యూజర్లలో 25 శాతం తమతమ ఖాతాలను రోజుకు 5కి మించి చెక్ చేసుకుంటుంటారు.(Source: Socialnomics)

9. ఫేస్‌బుక్‌ 10 లేదా అంతకుమించిన లైక్స్‌తో 42 మిలియన్ పేజీలను హోస్ట్ చేస్తుంటుంది. (Source: Jeff Bullas)

10. సుమారు 10 లక్షలకు పైగా వెబ్ సైట్లు ఫేస్‌బుక్‌తో పలు రకాలుగా సంబంధాలను కలిగి ఉన్నాయి. (Source: Uberly)
- బ్రియాన్ హోనిగ్మాన్

Share this Story:

Follow Webdunia telugu