Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనీ.. 'Sony Xperia Z' ఫోన్లో స్నానం చేసుకుంటూ.. మాట్లాడవచ్చట!

సోనీ.. 'Sony Xperia Z' ఫోన్లో స్నానం చేసుకుంటూ.. మాట్లాడవచ్చట!
, బుధవారం, 9 జనవరి 2013 (16:34 IST)
FILE
ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ సోనీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్లో స్నానం చేసుకుంటూ మాట్లాడుకోవచ్చునని ఆ సంస్థ వెల్లడించింది. స్నానం చేసుకుంటూ మాట్లాడినా.. ఆ స్మార్ట్ ఫోనుకు ఎలాంటి డామేజ్ కాదని ఆ సంస్థ తెలిపింది.

"కొత్త ఎక్స్పీరియా ఈజెడ్" అనే ఐదు ఇంచ్‌ల స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లను నీటిలో 3.3 అడుగుల లోతులో 30 నిమిషాల పాటు ఉపయోగించేలా సోనీ రూపొందించింది. ఇంకా ఈ ఫోన్‌లో హెచ్‌డీఆర్ వీడియో నమోదు చేసుకోవచ్చు.

ఈ టెక్నాలజీని సోనీ కెమెరా నుంచి స్మార్ట్ ఫోన్లలో లభించేలా సోనీ సంస్థ ఏర్పాటు చేసింది. అలాగే 7.9 మి.మి, 4జీ ఎల్టీఈ, మైక్రో ఎస్టీ స్లాట్, 13 మెకాఫిక్సల్ కెమెరా, 1080X1920 స్కీన్ వంటి ఫీచర్‌ను ఈ ఫోన్ కలిగివుంది.

అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఇలాంటి ఫోన్లను ఆవిష్కరించడంలో సోనీ ముందుంటని ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి చెప్పారు. అత్యాధునిక ఫీచర్స్‌తో సరికొత్త ఫోన్లను తమ సంస్థ అత్యధికంగా మార్కెట్లోకి విడుదల చేయడం పెరుగుతుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu