డేటింగ్ సైట్ లాంచ్ చేసిన రియల్ ఫేసెస్ డాట్ కామ్
ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్‌తో
రియల్ ఫేసెస్ ఎక్స్‌ట్రార్డినరీ సౌకర్యాలతో కొత్త ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ రియల్ ఫేసెస్ డాట్ కామ్ లాంచ్ చేసింది. ఇందులో ఇన్స్‌టెంట్ మసేజ్, ఆన్‌లైన్ ఛాటింగ్, ఆడియో-వీడియో ప్రొఫైల్, బ్లాగ్‌లు, ఫ్రీ ఈమెయిల్స్, లైవ్ వెబ్ కెమెరా, సైట్ మ్యాగజైన్, డేటింగ్ పార్ట్నర్‌ల కొరకు ప్రకటనలు, ఫ్రీ న్యూస్‌లెటర్, ఆన్‌లైన్ డేటింగ్ టిప్స్, డేటింగ్ సలహాలు, డేటింగ్ సమాచారం లాంటివి ఇందులో ఉంటాయి.
ఇందులో ఉండే సభ్యులు ఉచితంగా ఆన్‌లైన్ టిప్స్ పొందవచ్చు. రిలేషన్ షిప్ ఎక్స్‌పర్ట్స్‌తో డేటింగ్ మరియు సంబంధాల గురించి సలహాలు తీసుకోవచ్చు. ఈ సైట్‌లో ఈ-కార్డ్స్‌నుకూడా కొత్త తరహాలో పంపించవచ్చు.
ఈ వెబ్‌సైట్ ప్రత్యేకంగా యూజర్ ఫ్రెండ్లీ లేఔట్‌తో రూపొందించబడింది. ఇది ప్రత్యేకంగా అవివాహితులకు రూపొందించబడింది. దీంతో ఇందులోని సభ్యులకు డేటింగ్‌కు సంబంధించిన అన్ని అనుమానాలు తొలగిపోతాయి. ఇందులో సభ్యలు వారి పార్టనర్‌ల హరస్కోప్ మరియు లవర్ స్కోప్‌ను కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఒకరిపై మరోకరికి పూర్తి అవగాహన వస్తుంది.
వెబ్‌సైట్ లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ...సైట్‌లో యూట్యూబ్ ప్రొఫైల్‌నుకూడా జోడించబడి ఉంది. ఇది తమ బోనస్ ఫీచర్స్‌లో పొందుపరచబడి ఉంది. దీంతో తమ స్పెషల్ పార్టనర్‌ను వెతికే సమయాన్ని ఆదా చేయగలరని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా ప్రస్తుతం డేటింగ్ సైట్లు అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో రియల్ ఫేసెస్ డాట్ కామ్‌లో మరిన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.