Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త హార్డ్ ‌డిస్క్ కొనడానికి వెళ్తున్నారా?

Advertiesment
ఐటీ
మనిషికి గుండె ఎంత ప్రధానమో.. కంప్యూటర్‌కు హార్డ్ డిస్క్ అంతే కీలకం. గుండె ఎంత సామర్థ్యంతో పనిచేస్తే.. అంతబాగా శరీరంలోని రక్తనాళాలన్నింటికీ రక్తం సరఫరా అవుతుంది. అలాగే హార్డ్ డిస్క్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తే... కంప్యూటర్ అంత వేగంగా.. మనకు కావలసిన పనులను చక్కబెడుతుంది.

కంప్యూటర్‌‌లో ఇంత కీలక పాత్రను పోషించే హార్డ్ డిస్క్ ఎంచుకనేప్పుడు తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రాసెసర్ ఎంపికతో పాటు కంప్యూటర్‌లో 'రామ్' ఎంత కావాలి ? అలాగే హార్డ్ డిస్క్ ఎంతకావాలి ? అనే అంశాలు కీలకం. ఎందుకంటే.. హార్డ్ డిస్క్ ఎంత డేటా స్టోరేజీని కలిగి ఉండేది అయితే... కంప్యూటర్ అంత సమర్థవంతంగా పనిచేస్తుంది.

పెద్ద పెద్ద ఫైళ్ల స్టోరేజీకి, డేటాబేస్‌లు, సాఫ్ట్‌వేర్‌లు వంటి వాటిని నిర్వహించడంలో సైతం సౌకర్యవంతంగా పనిచేసుకోవాలంటే.. అది హార్డ్ డిస్క్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల కాలంలో.. మెగాబైట్‌ల నుంచి గిగా బైట్‌లకు వచ్చాక.. ప్రాథమిక దశలో మనకు 4జీబీ హార్డ్ డిస్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి.

దాని తర్వాత 8జీబీ, 10జీబీలు వచ్చాయి. కానీ, శరవేగంగా పెరుగుతున్న టెక్నాలజీతో పాటు.. హార్డ్ డిస్క్ సామర్థ్యం కూడా.. ఆ తర్వాత కాలంలో.. 20జీబీ, 40జీబీ, 80జీబీ, 100జీబీ, 160జీబీలు వచ్చాయి. చివరగా నేడు ప్రస్తుతం 250జీబీ హార్డ్‌ డిస్క్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

కానీ, ఎంత డబ్బు వెచ్చిస్తే.. అంత సామర్థ్యం కలిగి హార్డ్‌ డిస్క్‌ను మనం పొందవచ్చు. అయితే.. ఎంత హార్డ్ డిస్క్ మనకు అవసరమవుతుంది? అనేది ఎప్పుడూ మనకు ఎదురయ్యే ప్రశ్న. అదే సమయంలో ఎలాంటి హార్డ్ డిస్క్ మనకు కావాలి? ఎలాంటి అంశాలను చూసి హార్డ్ డిస్క్‌ను కొనుగోలు చేయాలి? అనే విషయాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది.

ఎందుకంటే.. హార్డ్ డిస్క్‌పై విషయావగాహన లేకుంటే.. అంతే సంగతులు. హార్డ్ డిస్క్ కొనాలనుకున్నపుడు.. కొన్ని అంశాలను మనం తప్పకుండా చూడవలసి ఉంటుంది.

1. ముందుగా మార్కెట్లో ఏయే కంపెనీలు.. ఎంత డేటా స్టోరేజీ కలిగిన హార్డ్‌ డిస్క్‌లు.. వీటి ధరలను ముందుగా చూడాలి. దీని తర్వాత..
2. ఇందులో మనకు ఎలాంటి ఇంటర్‌ఫేస్ కావాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి.
3. మన డేటా స్టోరేజీ అవసరాలు ఎలా ఉన్నాయి. పరిశీలించుకోవాలి.
4. పైన అంశాలతో పాటు డిస్క్ ఆర్‌పీఎం, రైట్ బ్యాక్, బఫర్ సైజు, కెపాసిటీ, సీక్‌టైమ్ వంటి తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
5. చివరగా... హార్డ్ డిస్క్‌కు అవసరమయ్యే విత్యుత్, దాని వారంటీ అనేవి కూడా ప్రధానంగా చూడవలసిన అంశాలు.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు.. 'వెబ్‌దునియా ఐటీ' తర్వాతి కథనాల్లో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu