దెబ్బకు ఠా.. దొంగల ముఠా అనే నానుడిని మీరు వినే ఉంటారు. ఒకే దెబ్బతో శత్రువులను మట్టికరిపించడమని దీనర్థం. దైనందిన జీవితంలో ఇది సాధ్యమవుతుందో లేదో కానీ కంప్యూటర్ రంగంలో మాత్రం అది సుసాధ్యమే. వైరస్ టోటల్ అనే యాంటీవైరస్ ప్రోగ్రామ్‌తో మీ కంప్యూటర్ ఫైళ్లను స్కాన్ చేయడం ద్వారా మీ ఫైళ్ళు సురక్షితంగా ఉంటాయి. ఇందుకు పట్టే సమయం చాలా తక్కువ. స్కానింగ్‌ను కూడా మీరు పనిగట్టుకుని చేయాల్సిన పనిలేదు. సులభంగా యాంటీవైరస్ ప్రోగ్రామ్‌ను మీ కంప్యూటర్లో నిక్షేపిస్తే చాలు మిగిలిన పనంతా అదే చూసుకుంటుంది.
ఇలా పనిచేస్తాయి...
యాంటివైరస్ ప్రోగ్రామ్‌లు కూడా మానవ నిరోధక వ్యవస్థలాగే పనిచేస్తాయి. మనిషి ఎప్పుడైనా జబ్బుపడిన తర్వాత తిరిగి కోలుకోవాలంటే ఎన్నో వ్యాధినిరోధక ఔషధాలను తీసుకోవాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తూ, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ విషయంలో, వైరస్ సంక్రమించడానికి మీరు (లేదా మీ కంప్యూటర్) మొదటి వ్యక్తి కానవసరం లేదు. హానికర కోడ్‌ను గుర్తించడం మరియు వాటిని ఎలా కనుగొనాలో సాఫ్ట్‌వేర్‌కు తెలియజేయడం వేరొకరి పని. మీరు ఒక ఫైల్‌ను వివిధ రకాల యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లన్నింటి నుండి ఒకేసారి వైరస్ టోటల్‌ని ఉపయోగించి స్కాన్ చేయవచ్చు.
మీకు అవసరమైనవి:
మీరు స్కాన్ చేయాలనుకునే ఫైల్, ఇంటర్నెట్ కనెక్షన్.
దశ 1: మీకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌లో "వర్చువల్ డాట్ కామ్"కు వెళ్ళండి.
దశ 2: స్కానింగ్ కోసం ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి, బ్రౌజ్ బటన్‌పై క్లిక్ చేసి ఫైల్‌ను గుర్తించండి. ఫైల్‌ను ఎంచుకున్న తర్వాత, సెండ్ ఫైల్ బటన్‌పై క్లిక్ చేయండి.
ప్రత్యామ్నాయ దశ 2: స్కానింగ్ కోసం వెబ్‌సైట్‌ను సమర్పించడానికి, సబ్మిట్ ఏ యూఆర్‌ఎల్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. వెబ్‌సైట్ చిరునామాను ఎంటర్ చేసి, సబ్మిట్ యూఆర్‌ఎల్ బటన్‌ను క్లిక్ చేయండి.
మీరు సమర్పించడానికి ప్రయత్నిస్తున్న ఫైల్ లేదా యూఆర్‌ఎల్ వైరస్ టోటల్ డేటాబేస్‌లో ఇప్పటికే కనుగొనబడి ఉంటే, మీరు తర్వాతి పేజీలో హెచ్చరించబడతారు. మీరు మీ ఫైల్/యూఆర్‌ఎల్ (సాధారణంగా ఒక శుద్ధమైన నివేదిక) గురించి రూపొందించబడిన గత నివేదికను వీక్షించడాన్ని ఎంచుకోవచ్చు లేదా ఇంకా ఏదైనా పేర్కొనవలసిన సమస్య ఉందని మీరు భావిస్తే ఫైల్/యూఆర్ఎల్‌ను మళ్లీ సమర్పించవచ్చు.
దశ 3: నివేదిక పేజీని వీక్షించండి. ఫలితం కాలమ్‌లోని డేటా ఇన్‌ఫెక్షన్‌ను ఎన్ని (ఏవైనా) యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లు గుర్తించగలవో తెలుపుతాయి. ప్రతి ప్రోగ్రామ్ కనుగొనే దాని మరింత వివరణాత్మక సమాచారాన్ని దీని దిగువన ఉన్న పట్టిక చూపిస్తుంది.
ఈ ఫైల్‌ను ఉపయోగించడంలో మీకు ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఫైల్ పరిమాణం పరిమితి 20ఎమ్‌బికి మించరాదు. మీకు ఇది పెద్దగా ఇబ్బందికరం కాకపోతే, ఇది ఇన్‌ఫెక్షన్‌ను ఎంతో సులభంగా గుర్తిస్తుంది. మీ వ్యక్తిగత కంప్యూటర్‌లో అదేస్థాయిని లేదా భద్రతను పొందడానికి బహుళ యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లను వ్యవస్థాపించడానికి ప్రయత్నించడం కొన్ని తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.
ఈ విధంగా బహుళ యాంటీవైరస్ అప్లికేషన్లతో మీ ఫైళ్లను స్కాన్ చేసుకుని, మీ ఫైళ్లను, సిస్టమ్‌ను వైరస్‌ల నుండి రక్షించుకోవచ్చు.