Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇప్పుడు MS Office 2007 తెలుగులో...

Advertiesment
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007
PR
నేటి ప్రపంచంలో కంప్యూటర్లతో పని చేయడం ఫ్యాషన్ మరియు నిత్యావసరం అయిపోయింది. భారతదేశంలో గత 15-20 సంవత్సరాలుగా ఇది భాగమైపోయింది. అయినప్పటికీ, ఇంగ్లీష్ భాషా అవరోధం మూలంగా భారతదేశ జనాభాలో అధిక శాతం ప్రజలు కంప్యూటర్లను ఉపయోగించడంలో శిక్షణను పొందలేకపోతున్నారు. ఇటీవల వరకు, ఈ భాషా అవరోధం వల్ల ఎక్కువగా భారతదేశంలోని గ్రామీణ ప్రజలు మరియు పట్టణాల్లో స్వల్ప శాతం ప్రజలు కంప్యూటర్లను ఉపయోగించలేకపోయారు.

అయితే ఇకపై అలా ఉండదు. ఎందుకంటే... ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ, Microsoft, కంప్యూటర్లను ప్రజలకు దగ్గర చేసే ఒక సరిక్రొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. Microsoft ఇప్పుడు అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లను అందిస్తోంది, దీనితో ప్రతి సామాన్యుడు కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు. భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లు లేదా సంక్షిప్తంగా LIPలను ఇన్‌స్టాల్ చేయడం మరియు ఉపయోగించడం చాలా సులభం. ఈ సాఫ్ట్‌వేర్ మీరు కంప్యూటర్లను చూసే విధానాన్ని మార్చేస్తుంది.

ఇక్కడ నుండి ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసి .exe పై క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాల్ చేయండి. దీన్ని ఇన్‌స్టాల్ చేసేందుకు మీరు మీ కంప్యూటర్‌లో Microsoft Office 2007 ఇంగ్లీష్ వెర్షన్‌ను కలిగి ఉండాలి. కొన్ని సెకన్లలో, మీ కంప్యూటర్ మీ స్వంత భాషలో మీకు కనిపిస్తుంది. డాక్యుమెంటేషన్, ఇమెయిల్, ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేయడం లేదా ఇటీవల మీకు కష్టంగా అనిపించిన దేనినైనా ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు ఇప్పుడు ఇది మీ స్వంత భాషలో ఉన్నందున, దాని గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగినందున ధైర్యంగా నేర్చుకోవచ్చు.

కాబట్టి, దీన్ని ఉపయోగించి చూడండి... ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది!

ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Share this Story:

Follow Webdunia telugu