వాల్‌స్ట్రీట్‌లో బ్యాంకులు భారీ ఎత్తున దెబ్బ తిన్నాయి. ఇది భారత దేశంలోకి రానున్న 3 జి స్పెక్ట్రమ్ ఆక్షన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. యూరిపియన్ బ్యాంకులు గ్లోబల్ బిడ్డర్లను ఈ ఆక్షన్స్‌కు చాలా దూరంగా ఉంచుతున్నాయి. అమెరికా ఆర్థిక సంక్షోభంతో బిడ్డర్లలో భయం కనిపిస్తోంది.
గ్లోబల్ బిడ్డర్లు రంగంలోకి దిగకపోతే భారత ప్రభుత్వం తీవ్ర నష్టాలనే చవి చూడాల్సి వస్తుంది. 3జి స్పెక్ట్రమ్‌పై భారత ప్రభుత్వం కనీసం రూ. 40 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ముందుకు నడుస్తోంది. గ్లోబల్ బిడ్డర్లు రాకపోతే ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండదు.
లేమాన్ బ్రదర్స్, మెరిల్ లించ్ ఇప్పకే ఉన్న ఆపరేటర్లు, కొత్తగా వచ్చే వారికి ఆర్థిక సాయం చేసేది. అయితే లేమాన్ బ్రదర్స్ ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో పరిస్థితులో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ఈ విధంగా ఆర్థిక సంస్థలు దెబ్బతినే పరిస్థితి రావడంతో ఆందోళన మొదలయ్యింది. ఈ సంస్థల్లో గందరగోళ పరిస్థితుల కారణంగా 3జి బిడ్డర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.