Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్నెట్ అంటే బూతు బొమ్మలే : ఇది నెటిజన్ల అభిప్రాయం!!

Advertiesment
ఇంటర్నెట్
, మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (11:28 IST)
File
FILE
ఇంటర్నెట్ అంటే కేవలం బూతు బొమ్మలేనా? ప్రపంచంలో మూడో వంతు మంది దీనికి అవుననే అంటున్నారు. కేవలం బూతు బొమ్మలను చూడటానికే 30 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది.

నెట్లోని ట్రాఫిక్‌లో 30 శాతం బూతు వెబ్‌సైట్లదేనంటే ఆశ్చర్యపడక్కరలేదని కూడా అధ్యయనం చెప్పింది. విశ్వవ్యాప్తంగా లక్షలాది వెబ్ సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ కేవలం ఈ పార్న్ సైట్లకే ఉందని అధ్యయనం గమనించింది. పార్న్ సైట్లలో కొన్నింటికి అత్యంత ఆదరణ ఉంది.

ప్రతీ నెల ఈ సైట్లలోని బూతు బొమ్మలను చూడటం కోసం ఏకంగా నాలుగు బిలియన్ల పేజీ వీక్షణలు జరుగుతుండగా, ప్రత్యేకించీ ఈ సైట్లలోని వీడియోలను చూసేందుకు జరిగే సందర్శనలు ఏకంగా 350 మిలియన్లు. ఎక్స్‌ట్రీమ్‌టెక్ అనే వెబ్‌సైట్ ఈ అధ్యయనం జరిపింది.

గూగుల్, ఫేస్‌బుక్‌లతో సమానంగా ఈ బూతు వెబ్‌సైట్లు నెట్‌లో ప్రాచుర్యం పొందాయని అధ్యయనంలో కనుగొన్నట్లు అమెరికాకు చెందిన ఒక వార్తా సంస్థ చెప్పింది. అత్యంత ఆదరణ పొందిన ఒక పార్న్ వెబ్‌సైట్లో ఉంచిన బూతు బొమ్మలు, వీడియోల పరిమాణం 100 టెరాబైట్లు కాగా వాటిని చూసేందుకు నమోదయ్యే వీక్షణలు 100 మిలియన్లని ఆ అధ్యయనం తేల్చింది.

Share this Story:

Follow Webdunia telugu