ఇటీవల మనం యాపిల్ సంస్థ అమెరికా ప్రభుత్వ రిజర్వ్ నిధుల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును కలిగివున్నట్లు విన్నాం. ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ప్రభుత్వం వద్ద కేవలం 73.76 బిలియన్ డాలర్లు ఉంటే యాపిల్ 75.87 బిలియన్ డాలర్లను కలిగివుంది. ఈ విధంగా ఎందుకు జరిగింది? అత్యంత శక్తివంతమైన ఈ దేశ దుర్భరస్థితికి ఎదుకు చేరింది. ఇందుకు చాలా బలమైన కారణాలనే చెప్పుకోవచ్చు. ఒక దేశానికి ఒక కంపెనీ మధ్య పోలిక సులభం కానప్పటికీ మనం కేవలం కొన్ని కారణాలను పరిశీలిద్దాం.
అమ్మకం - దాడులు:
ఉత్పత్తులను విదేశాలకు అమ్మడం ద్వారా ఆచరణలో ఆర్థికంగా బలంగా తయారుకావచ్చు. యాపిల్ ఇదే మార్గాన్ని అనుసరించింది. ఎవరికీ హాని కలిగించని మార్కెట్లో నూతన ట్రెండ్‌ను సృష్టించే అద్భుత ఉత్పత్తులను తయారు చేసిన యాపిల్ తమ దేశంలోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది.
యాపిల్ ఉత్పత్తులతో ఆనందించిన ప్రజలు వాటిని కొనుగోలు చేస్తూ ఉండటంతో కంపెనీ రిజర్వ్ నిధి 75.87 బిలియన్ డాలర్లకు చేరుకోగలిగింది. మరోవైపు బాంబులు, యుద్ధవిమానాలు తయారు చేయడంపై దృష్టిపెట్టిన అమెరికా ప్రభుత్వం పదివేల కిలోమీటర్ల దూరంలోని దేశాలకు బలగాలను పంపిస్తున్నది. పర్యవసానమే అమెరికా ఈ దుస్థితికి చేరింది. ఇతరులకు లేదా దేశాలకు హాని కలిగేలా వ్యవహరించి రుణ ఊబిలోకి జారుకుంది.