Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలం సరిహద్దులను చెరపనున్న డేటా స్పీడ్‌

డేటా స్పీడ్‌లో 5 జీబీ ఏం ఖర్మ.. సెకనుకు వంద జీబీ స్పీడ్ వచ్చేసింది.

Advertiesment
hiroshima university
హైదరాబాద్ , సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (23:59 IST)
టెక్నాలజీ ఆవిష్కరణలకు ఊతమిచ్చేది వేగం. పాత ఉత్పత్తులను మించిన నిపుణత మాత్రమే కాదు. పాత పరికరాల కంటే కొత్తవి ఎంత వేగంతో పనిచేస్తాయి, కస్టమర్‌కి ఏ స్థాయిలో సంతృప్తిని కలిగిస్తాయి అనేదే నూతన ఉత్పత్తులకు, నూతన టెక్నాలజీకి గీటురాయి వంటిది. డేటా స్పీడ్‌ విషయంలో 4 జి విప్లవాత్మకం అనుకుంటే 5 జిబి అత్యంత విప్లవాత్మకం అనుకోవాలి. కాని వీటిని తలదన్నే నూతన విధానం ఇప్పుడు ఆవిష్కరించబడింది. సెకనుకు 5 జీబీ అనేది ఇప్పుడు డేటా స్పీడ్‌లో అత్యంత తాజా పరిణామం కాగా సెకనుకు 100 జీబీ స్పీడ్‌తో డేటాను  బదిలీ చేసే ప్రక్రియను జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు
 
టోక్యో 5జీ కంటే పది రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌ను అందించే నూతన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సెకనుకు 100 జీబీ డేటాను బదిలీ చేసే టెరాహెట్జ్‌ ట్రాన్స్‌మిటర్‌ కేబుల్‌ను అభివృద్ధి చేసినట్లు జపాన్‌కు చెందిన హిరోషిమా యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 290 గిగాహెర్జ్‌-315 గిగాహెర్జ్‌ల బ్యాండ్‌ విత్‌ కలిగి 105 గిగాబైట్ల వేగంతో సమాచారాన్ని బదిలే చేసే కేబుల్‌ను వీరు అభివృద్ధి చేశారు. 
 
ప్రస్తుతం ఈ ఫ్రీక్వెన్సీ శ్రేణిని కేటాయించకపోయిన్పపటికీ 290 గిగాహెట్జ్‌- 450 గిగాహెర్ట్ట్ట్జ్‌ శ్రేణిలోకి ఇది వస్తుంది. ఈ డేటా వేగంతో ఓ డీవీడీలోని డేటాను సెకన్‌లో బదిలీ చేయొచ్చు. సాధారణంగా డేటాస్పీడ్‌ను మెగాబైట్స్‌ ఫర్ సెకన్‌, గిగాబైట్స్‌ ఫర్ సెకన్‌గా చెప్పుకుంటుంటారు. అయితే ప్రస్తుతం తాము సింగిల్‌ కమ్యూనికేషన్‌ చానల్‌ ఉపయోగించి టెరాబైట్స్‌ ఫర్ సెకన్‌కు చేరువ కాగలిగామని హిరోషిమా యూనివర్సిటీకి చెందిన మినోరు ఫిజిషిమా చెప్పారు.
 
డేటా స్పీడ్‌ విషయంలో కాలం సరిహద్దులు చెరిగిపోయే తరుణం మనిషి అనుభవంలోకి వస్తున్నట్లుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిత్రధర్మానికి గండి కొడుతున్న టీడీపీ: తొలి ఝలక్ ఇచ్చిన బీజేపీ