ఆన్‌లైన్‌లో జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ఇలా బుక్ చేసుకోండి...
దేశ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. గురువారం నుంచి జియో ఉచిత ఫోన్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం 5.30 గంటల నుంచి బుకింగ్ మొదలువుతుంది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో కూడా
దేశ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. గురువారం నుంచి జియో ఉచిత ఫోన్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం 5.30 గంటల నుంచి బుకింగ్ మొదలువుతుంది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో కూడా బుక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో బుక్ చేయదలచుకున్న వారు ముందుగా ఆన్‌లైన్‌లో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫిషియల్ వెబ్‌సైట్ jio.comను విజిట్ చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభంకాగానే, హోమ్‌పేజీపై ఇమేజ్ లేదా బటన్ డిస్‌ప్లే అవుతుంది. జియో ఫ్రీ మొబైల్ ఫోన్ రిజిస్ట్రేషన్ లేదా ప్రీ బుకింగ్ బటన్‌ను క్లిక్ చేయాలి. అందులో పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
కాంటాక్ట్ నెంబర్, షిప్పింగ్ అడ్రస్ కూడా నమోదు చేయాలి. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1500 చెల్లించాలి. ఆ తర్వాత జియో ఫోన్ బుకింగ్ జరుగుతుంది. సెప్టెంబర్‌లో జియో ఫోన్ డెలివరీ మొదలవుతుంది. మైజియో యాప్ నుంచి కూడా జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఇకపోతే.. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఆథరైజ్డ్ జియో రిటేలర్ లేదా రిలయన్స్ డిజిటల్ ఔట్‌లెట్‌కు వెళ్లి బుక్ చేసుకోవాలి. ఫోన్ బుక్ చేసుకునేందుకు ఆధార్ నెంబర్ ఖచ్చితం. ఒక్కో ఆధార్ కార్డుకు ఒక్క ఫోన్ మాత్రమే ఇస్తారు. ఆధార్ డిటేల్స్ ఇచ్చిన తర్వాత ఆ సమాచారం సెంట్రలైజ్డ్ సాఫ్ట్‌వేర్‌కు అప్‌లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీకు టోకెన్ నెంబర్ వస్తుంది. ఫోన్ డెలివరీ సమయంలో ఈ నెంబర్ అవసరం ఉంటుంది. ఇందుకోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.1000ని ఫోన్ డెలివరీ సమయంలో చెల్లించి ఫోన్‌ను పొందవచ్చు.