Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క రూపాయికే రెడ్‌మీ 4ఏ ఫోన్.. హౌ...?

చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సంస్థ తయారు చేసే అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఫోన్లలో ఒకటైన 4ఏను కేవలం ఒక్క రూపాయికే అందించనుంది. అదీకూడా ఈ ఆఫర్ కేవలం భారతీయ మొబైల్

Advertiesment
Xiaomi's 3rd Mi Anniversary Sale
, బుధవారం, 19 జులై 2017 (09:04 IST)
చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సంస్థ తయారు చేసే అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఫోన్లలో ఒకటైన 4ఏను కేవలం ఒక్క రూపాయికే అందించనుంది. అదీకూడా ఈ ఆఫర్ కేవలం భారతీయ మొబైల్ వినియోగదారులకు మాత్రమే కావడం గమనార్హం. 
 
భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఈ కంపెనీ ప్రవేశించి మూడేళ్ళు కానుంది. దీన్ని పురస్కరించుకుని ఈనెల 20, 21వ తేదీల్లో ఈ బంపర్ ఆఫర్‌‌ను ప్రకటించింది. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో తాజాగా లాంచ్ చేసిన రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. 
 
ఫ్లాష్‌ సేల్‌లో భాగంగా రెడ్‌మీ 4ఏ, వై-ఫై రిపీటర్ 2, 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2, ఇతర యాక్సెసరీలు తదితర వాటిని రూపాయికే పొందవచ్చంటూ బంపరాఫర్ ఇచ్చింది. అలాగే, ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టాక్ అయిపోయే వరకు ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి ఉంచనున్నారు. అదేవిధంగా రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4, రెడ్‌మీ 4ఏ, ఇయర్ ఫోన్లు, సెల్పీ స్టిక్‌లు, వీఆర్ ప్లేలు అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లాష్ సేల్ ఈనెల 20, 21 తేదీల్లో ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించనున్నట్టు షియోమీ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య... పవన్ కల్యాణ్‌ ఏమన్నారంటే...