భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో త్వరలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతుంది. లాభాలు పెంచుకునే చర్యల్లోభాగంగా, పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించాలని భావిస్తుంది. వీరిలో మిడ్ లెవల్ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో కంపెనీ లాభాలు... పోటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ తొలగింపుల పర్వాన్ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ నెల ఆరంభంలో ఉద్యోగులకు ఈ మేరుక సంచారం అందించనుంది. ఆన్‌సైట్‌ల ఉన్న వందల మంది మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను సాగనంపనున్నారు. వీళ్ళలో చాలా మంది భారీ వేతనాలు తీసుకుంటున్నవారు ఉండటం గమనార్హం. కాగా, కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే బాధ్యతను సీఎఫ్ఓ అపర్నా అయ్యర్‌కు కంపెనీ అప్పగించింది. ఈ లేఆఫ్స్‌లో భాగంగా, సంస్థ లెఫ్ట్ షిఫ్ట్ పద్ధతిని అనుసరిచనున్నట్టు తెలిసింది. లెవల్-3 ఉద్యోగి బాధ్యతలు లెవల్-2 ఉద్యోగికి వెళతాయి. లెవల్-2 బాధ్యతలు లెవల్-1కు మారుతాయి. ఇక లెవల్-1 బాధ్యతలను ఆటోమేట్ చేయాలి. ఈ తరహా విధానాన్ని అన్ని కంపెనీలు చేస్తున్నాయి.