వాట్సాప్‌లోనే ఇకపై యూట్యూబ్ వీడియోలను చూడొచ్చు..
నెటిజన్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే యూట్యూబ్ వీడియోలను చూడొచ్చు. వాట్సాప్‌లో ఇతరులు పంపిన యూట్యూబ్ లింకులను చూడాలంటే..యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే. అయితే ఇకపై వాట్సాప్ చాట్‌లోనే చూడగలిగే యూట్యూబ్
నెటిజన్లకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనే యూట్యూబ్ వీడియోలను చూడొచ్చు. వాట్సాప్‌లో ఇతరులు పంపిన యూట్యూబ్ లింకులను చూడాలంటే..యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే. అయితే ఇకపై వాట్సాప్ చాట్‌లోనే యూట్యూబ్ లింకులను చూడగలిగే సౌకర్యాన్ని వాట్సాప్ కల్పించింది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ కల్పించిన సౌకర్యాలు ఆపిల్ ఫోన్లలో వుండవు.
ఇప్పటి వరకు వాట్సాప్‌లోనే యూట్యూబ్ చూసే సౌకర్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఐఫోన్ 6ఎస్, ఐఫోన్7 లాంటి హై రెజల్యూషన్ ఫోన్లకు వాట్సాప్ పంపించింది. ఈ సౌకర్యం ద్వారా యూట్యూబ్ వీడియోలను సులభంగా పంచుకునే అవకాశం కలుగుతుందని వాట్సాప్ పేర్కొంది. అయితే ఈ అప్ డేట్లు.. ఆపిల్ ఫోన్లలో లేకపోవడం ద్వారా ఆపిల్ వినియోగదారుల నుంచి వాట్సాప్‌కు ఫిర్యాదులు అందాయి. వారి సౌకర్యార్థమే ఈ నూతన అప్‌డేట్లు పంపిస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.