Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లేటెస్ట్ వర్షన్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

సామాజిక మాధ్యమం వాట్సాప్‌కున్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా గురించి ఈరోజుల్లో తెలియని వాళ్ళు, వాట్సాప్ గురించి తెలుసుకోనివాళ్ళు అమాయకుల కిందే కాదు అసలు ప్రపంచంలో ఏమీ ఎరుగని

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లేటెస్ట్ వర్షన్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (09:53 IST)
సామాజిక మాధ్యమం వాట్సాప్‌కున్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా గురించి ఈరోజుల్లో తెలియని వాళ్ళు, వాట్సాప్ గురించి తెలుసుకోనివాళ్ళు అమాయకుల కిందే కాదు అసలు ప్రపంచంలో ఏమీ ఎరుగని వారి కిందే లెక్క. ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించడం అనేది ఇప్పుడు ఒక గౌరవంగా మారింది. కాలంతోపాటు అప్‌డేట్‌గా ఉన్నట్టు లెక్క అంటే వాట్స్ యాప్ వినియోగించేవాళ్లే. దీంతో పలు సరికొత్త ఫీచర్లతో నిండిన వాట్సాప్‌ లేటెస్టు వర్షన్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 
 
సాధారణంగా ఫోన్‌బుక్‌లో లేని నంబర్లకు వాట్సప్‌చేయమని ఎవరైనా అడిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పలానా నెంబర్‌ను కాంటాక్ట్‌‌లో సేవ్ చేస్తేనే వాట్సాప్‌ జాబితాలో చేరుతుంది. అదీ కూడా త్వరగా స్క్రీన్‌లో కనిపించదు. ఏ 10 నిమిషాలకో లేదా అరగంట వరకు గాని  తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. క్షణాల్లో వాట్సాప్‌ జాబితాలో చేరేలా కొత్త బీటా వర్షన్‌ను విడుదలచేసింది. 2.16.248 వర్షన్‌తో ఇలా ఫోన్‌బుక్‌లో సేవ్‌చేసిన వెంటనే వాట్సాప్‌లో అప్‌డేట్‌ అవడం దీనికున్న ప్రత్యేకత. 
 
ఎప్పటినుండో ఎదురు చూసే ఈ ఆప్షన్‌ రావడం వాట్సాప్‌ ప్రియులకు నిజంగా శుభవార్తే. కానీ ఈ సౌకర్యం ప్రస్తుతం బీటావర్షన్‌ టెస్టింగ్‌ దశలోనే ఉంది. ఈ ఫీచర్‌ కావాలనుకునేవారు నేరుగా ఈ వర్షన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. త్వరలో సాధారణ అప్‌ డేట్‌లోనూ ఇది రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థత... ఐసీయూలో అడ్మిట్