ఎన్నో సౌకర్యాలు... 6 GB ర్యామ్- 64 GB స్టోరేజీ, ZTE Z17 ఫోన్ కొంటారా?
జర్మనీకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ ZTE చైనా, భారత్‌లలో ఇదివరకే తన ఉత్పత్తులను విడుదల చేస్తూ ఉంది. ఇప్పుడు దాని అనుబంధ బ్రాండ్ నూబియా Z17 మినీ పేరుతో డ్యూయల్ కెమెరాతో, 6 GB ర్యామ్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ని భారత్, చైనా మార్కెట్లోనికి ప
జర్మనీకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ ZTE చైనా, భారత్‌లలో ఇదివరకే తన ఉత్పత్తులను విడుదల చేస్తూ ఉంది. ఇప్పుడు దాని అనుబంధ బ్రాండ్ నూబియా Z17 మినీ పేరుతో డ్యూయల్ కెమెరాతో, 6 GB ర్యామ్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ని భారత్, చైనా మార్కెట్లోనికి ప్రవేశపెట్టనుంది. త్వరలో లాంచ్ అవుతున్న ఈ ఫోన్ భారత్ మధ్యతరగతి చెందిన మొబైల్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకొనే విధంగా ఎన్నో ఫీచర్స్‌ని కలిగి ఉంది.
5.2 అంగుళాల హెచ్‌డి డిస్ప్లే (1920x1080 p), ఆక్టాకోర్ క్వాల్‌కాం 652 ప్రొసెసర్, ఆండ్రోయిడ్ 6.01, 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2950mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీతో త్వరలో అడుగుపెట్టే ఈ మొబైల్ ఫోన్ కోసం ఇప్పటికే చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇందులో 64 GB ఇంటర్నల్ మెమరీ ఇంకో ప్రత్యేకత. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ ఫోన్ విలువ కేవలం 16,999 రూపాయలేనట. ఈ ఫోన్ రాకతో పెద్ద కంపెనీల స్మార్ట్ ఫోన్లకు పోటీ అని అంటున్నారు. చూడాలి... ఏమేరకు సక్సెస్ అవుతుందో.