Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విస్తారా ఎయిర్‌లైన్స్ నిషేధం

ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్‌కు మరో గట్టిషాక్ తగిలింది. తమ విమానాల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మొబైల్స్‌ను నిషేధిస్తున్నామని స్వదేశీ విమానయాన సంస్థ విస్తారా ప్రకటించింది. క్యాబిన్ బ్యాగ్స్‌

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విస్తారా ఎయిర్‌లైన్స్ నిషేధం
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:53 IST)
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్‌కు మరో గట్టిషాక్ తగిలింది. తమ విమానాల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మొబైల్స్‌ను నిషేధిస్తున్నామని స్వదేశీ విమానయాన సంస్థ విస్తారా ప్రకటించింది. క్యాబిన్ బ్యాగ్స్‌లోనే కాదు చెక్ ఇన్ బ్యాగేజ్, కార్గోలో కూడా ఈ ఫోన్లు ఉంచుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 
 
మొబైల్‌లోని ని బ్యాటరీలు పేలుతున్నాయని, అంటుకుంటున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే, విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. మరోవైపు... మలేషియన్ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఏషియా కూడా గెలాక్సీ నోట్ 7ను బ్యాన్ చేస్తున్నామంటూ ఆదివారం ప్రకటించిన విషయం తెల్సిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్యుల నిర్లక్ష్యం... పాము కాటుకు వ్యక్తి మృతి