ట్విట్టర్ యూజర్లకు తీపికబురు.. ట్వీట్లలో ప్రేమలేఖలూ రాసుకోవచ్చు...
ట్విట్టర్ యూజర్లకు త్వరలో తీపికబురు అందనుంది. ఈ సోషల్ మీడియాను ఉపయోగించే యూజర్లు ఇపుడు చిన్నచిన్న వ్యాఖ్యలు మాత్రమే ట్వీట్స్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ విధానంలో మార్పు చేయనుంది.
ట్విట్టర్ యూజర్లకు త్వరలో తీపికబురు అందనుంది. ఈ సోషల్ మీడియాను ఉపయోగించే యూజర్లు ఇపుడు చిన్నచిన్న వ్యాఖ్యలు మాత్రమే ట్వీట్స్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ విధానంలో మార్పు చేయనుంది. యూజర్లు తమ ట్వీట్లను కుదించాల్సిన పనిలేదు. చక్కగా, స్వేచ్ఛగా, సుదీర్ఘంగా రాసుకునే వెసులుబాటును ఈ సామాజిక మాధ్యమం కల్పించనుంది.
వాస్తవానికి ఈ విషయాన్ని మేలోనే ప్రకటించినప్పటికీ.. ఈనె 19వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్విట్టర్ తాజా ప్రకటన యూజర్లలో సంతోషాలు నింపింది. 140 క్యారెక్టర్ల పరిమితిలో ఇక నుంచి ఫొటోలు, లింకులను లెక్కపెట్టడాన్ని ఆపివేస్తారు. దీంతో వినియోగదారులు మరింతగా టెక్ట్స్ రాసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం లింకుకు 23 కేరెక్టర్లు, ఫొటోకు 24 కేరక్టర్ల చొప్పున వినియోగదారులు స్పేస్‌ను నష్టపోతున్న సంగతి తెలిసిందే.