Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Thanks to Jio : ఫోన్‌ బిల్లులు తగ్గాయంటున్న వినియోగదారులు!

రిలయన్స్ జియోకు ఫోన్ వినియోగదారులు ధన్యవాదాలు చెపుతున్నారు. జియో సేవలు అందుబాటులోకి రాకముందు ఫోను బిల్లులు తడిసి మోపెడయ్యేవి. కానీ, జియో సేవలు అందుబాటులోకి వచ్చాక ఫోన్ బిల్లులు గణనీయంగా తగ్గిపోయాయి.

Thanks to Jio : ఫోన్‌ బిల్లులు తగ్గాయంటున్న వినియోగదారులు!
, బుధవారం, 23 ఆగస్టు 2017 (09:21 IST)
రిలయన్స్ జియోకు ఫోన్ వినియోగదారులు ధన్యవాదాలు చెపుతున్నారు. జియో సేవలు అందుబాటులోకి రాకముందు ఫోను బిల్లులు తడిసి మోపెడయ్యేవి. కానీ, జియో సేవలు అందుబాటులోకి వచ్చాక ఫోన్ బిల్లులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో జియోకు శతకోటి వందనాలు అంటూ కోట్లాది మంది ఫోన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
నిజానికి జియో రాకముందు... వివిధ రకాల టారిఫ్‌లతో అన్ని టెలికాం కంపెనీలు మోత మోగిస్తూ వచ్చాయి. కానీ జియో వచ్చాక టెల్కోలన్నీ కిందకి దిగొచ్చాయి. దీంతో గత ఏడాదిగా వినియోగదారుల మొబైల్‌ బిల్లులు భారీగానే తగ్గాయి. అంతేకాక టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంతో మరింత స్థాయిలో ధరలు కిందకి పడిపోనున్నాయని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు.
 
వచ్చే ఏడాది సగటున 25-30 శాతం టారిఫ్‌లు కిందకి పడిపోవచ్చని విశ్లేషకులు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్‌ అంచనావేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ డేటా వాడే వారైతే, మరింత లబ్ది పొందవచ్చంటూ పేర్కొంటున్నారు. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం గతేడాదిగా టారిఫ్‌ ధరలు కనీసం 25-32 శాతం కిందకి పడిపోయాయి. ఎక్కువ డేటా వాడేవారికి ధరల నుంచి 60-70 శాతం ఉపశమనం లభించిందని తెలిసింది. 
  
సగటున ఈ ఏడాది మొబైల్‌ బిల్లులు 25-18 శాతం తగ్గుతాయని డెలాయిట్ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ పార్టనర్‌ హేమంత్‌ జోషి అన్నారు. వచ్చే ఏడాది 30 శాతం పడిపోయే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. రెండంకెల స్థాయిలో కూడా ధరలు పడిపోవచ్చని కేపీఎంజీ చెబుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు పచ్చి మోసకారి.. ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదు : సినీ నటి కవిత