జియో దెబ్బ.. టెలినార్ బంపర్ ఆఫర్.. రూ.28లకే 4జీ డేటా ఆఫర్
3 నెలల పాటు వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ 4 జీ డేటా ఫ్రీ అంటూ ప్రివ్యూ, వెల్ కమ్ ఆఫర్లు ఇచ్చి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న
3 నెలల పాటు వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ 4 జీ డేటా ఫ్రీ అంటూ ప్రివ్యూ, వెల్ కమ్ ఆఫర్లు ఇచ్చి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా టెలినార్ సంస్థ వినియోగదారులకు రూ. 28 లకే 2జీ, 4జీ 1జిబి డేటా ఆఫర్‌ను ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కస్టమర్లు ఈ ప్యాక్‌పై అపరిమితంగా డేటా సర్ఫింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
అంతేకాదు డేటాను 28 రోజుల గడువుతో పొందవచ్చని సూచించింది. అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు టెలీనార్ నెట్‌వర్క్ పరిధిలో అపరిమిత కాల్స్ కోసం 28 రోజలు కాల వ్యవధితో రూ.17, అలాగే 90 రోజుల కాల వ్యవధితో రూ.33తో రెండు ప్యాక్‌లను ప్రకటించింది.