అవినీతి స్కామ్ కేసులో శామ్‌సంగ్ వైస్ ఛైర్మన్ యంగ్‌కు ఊరట..
అవినీతి స్కామ్ కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శామ్‌సంగ్ వైస్ ఛైర్మన్ లీజే యంగ్‌కు కోర్టు ఊరట లభించింది. రెండు సంస్థల విలీనానికి సంబంధించి రాజకీయ మద్దతు కోసం ఆ దేశాధ్యక్షురాలికి సంబంధించిన సంస్థలక
అవినీతి స్కామ్ కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శామ్‌సంగ్ వైస్ ఛైర్మన్ లీజే యంగ్‌కు కోర్టు ఊరట లభించింది. రెండు సంస్థల విలీనానికి సంబంధించి రాజకీయ మద్దతు కోసం ఆ దేశాధ్యక్షురాలికి సంబంధించిన సంస్థలకు భారీ విరాళం అందజేశారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు వారెంటు జారీ చేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. దీనిని ఆ దేశ న్యాయస్థానం తిరస్కరించింది.
ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షురాలిని పదవి నుంచి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాము ఎటువంటి తప్పు చేయలేదని శామ్‌సంగ్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షురాలు లంచాలు స్వీకరించేందుకు సన్నిహిత మిత్రుడైన చోయ్ సూన్ సిల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థను వాడుకుంటారనే ఆరోపణలున్నాయి. ఇందుకు విరాళాలు ఇచ్చినట్లు యంగ్‌పై ఆరోపణలున్నాయి. దీనిపై యంగ్ స్పందిస్తూ.. విరాళాలు ఇచ్చిన మాట నిజమే కానీ తాము ఏదీ ఆశించలేదన్నారు.