ఇక రూ.10కే కిరాణా షాపుల్లో వైఫై డేటా
రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు
రిలయన్స్ ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. డేటా ఇంత సులభంగా అదీ ఉచితంగా దొరకడంతో వినియోగదారులు జియో కోసం పరుగులు తీశారు. ఫలితంగా భారీ స్థాయిలో రిలయన్స్ జియోకు కస్టమర్లు చేరారు. రిలయన్స్ ధాటికి ఇతర టెలికాం సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ కోలుకునేందుకు వినియోగదారులను తమవైపు లాగేందుకు మరిన్ని ఆఫర్లు ప్రకటించాయి.
అయితే జియోకు పోటీగా డేటా ప్లాన్స్ ప్రకటించలేకపోయాయి. ఈ నేపథ్యంలో కిరాయి దుకాణాల్లో ఇకపై వైఫై లభించనుంది. కిరాణా షాపుల్లో రూ.10కే వైఫై డేటా ప్యాక్‌లు లభిస్తాయి. కేంద్రానికి చెందిన టెలిమాటిక్స్ (సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్.. సీ-డాట్) ఈ కొత్త ప్లాన్‌ను ప్రజల కోసం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ డేటా పీడీవో డివైస్ ద్వారా పొందవచ్చు.