Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్ ఫోన్లతో మనం ఏం కోల్పోతున్నామో.. తెలుసా...?

స్మార్ట్ ఫోన్‌. మానవజీవితాన్ని నాశనం చేస్తోంది. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా డిజిటల్‌ గేముల్లో మునిగి తేలుతుంటే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లలో ఎప్పటికప్పుడు పోస్టింగ్స్ చెక్‌ చేసుకుంటూ కాలం

Advertiesment
smartphones
, ఆదివారం, 25 డిశెంబరు 2016 (15:45 IST)
స్మార్ట్ ఫోన్‌. మానవజీవితాన్ని నాశనం చేస్తోంది. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా డిజిటల్‌ గేముల్లో మునిగి తేలుతుంటే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లలో ఎప్పటికప్పుడు పోస్టింగ్స్ చెక్‌ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ పుణ్యమా అని మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోతున్నాయి. సగటున ప్రతి ఆరున్నర నిమిషాలకొకసారి స్మార్ట్ ఫోన్‌ వినియోగిస్తున్నాడు నేటి మనిషి.
 
స్మార్ట్ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరు వీకెండ్‌ సెలవుల్లో షికారు కోసం బీచ్‌ ఒడ్డుకో, పచ్చటి పార్కుకో ఇష్టమైన రెస్టారెంట్‌కో వెళ్ళినప్పుడు ఎంచక్కా చేతిలో చేయి వేసుకొని పొద్దు తెలియకుండా కబుర్లు చెప్పుకునేవారు. పిల్లలతోని వెళ్లిన వారు వారి ఆట, పాట చూసి ముచ్చటపడేవారు వారి ముద్దుముద్దు మురిపాలను చూసి ఆనంద తన్మయత్నంలో తేలిపోయేవారు.
 
కానీ ఇప్పుడు భార్యాభర్తలు పార్క్‌లకు బీచ్‌లకు వెళుతున్నా చేతిలో చేయి వేసుకోవడానికి వేలుపట్టుకుని పిల్లలను నడిపించేందుకు వారి చేతులు ఖాళీగా ఉండడం లేదు. ఇప్పుడు వారి చేతుల్లో స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని భార్యా భర్తల్లో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, ఆప్యాయతలు తరిగిపోతున్నాయి. ఆ స్థానంలో అసంతృప్తి చోటుచేసుకుంటోంది. ఎంతోమంది అసంతృప్తితోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.
 
చివరికి పడకగదిలో కూడా స్మార్ట్ ఫోన్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. రొమాంటిక్‌ మూడ్‌ను కూడా నాశనం చేస్తోంది. ఇద్దరిలో ఒకరి మనసు హఠాత్తుగా సెల్‌ఫోన్‌ వైపు మళ్ళుతోంది. అది అందుకుంటే మనసు మరెటో వెళ్ళిపోతోంది. పక్కన పిల్లలు ఉన్నా ఆఫీసులో పనిచేస్తున్నా రోడ్డుపై నడుస్తున్నా మనుషులతో మాట్లాడుతున్నా స్మార్ట ఫోన్‌‌లో మాత్రం అప్‌‌‌డేట్స్ చూస్తుండాల్సిందే. పోస్టింగులు పెడుతూ కాలం గడిపేయాల్సిందే.
 
భార్యా పిల్లలతో ప్రేమగా గడిపే సమయాన్ని స్మార్ట్ ఫోన్‌ మింగేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్‌ దూరంగా ఉన్న మనుషులను దగ్గర చేస్తూనే దగ్గరున్న మనుషులను దూరం చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేవికావు... డిసెంబర్ 30వ తర్వాత నగదు విత్‌డ్రాపై ఆంక్షలు