Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వికీపీడియా, బ్రిటానికాలను తలదన్నే ఎన్‌సైక్లోపీడియా తయారీలో చైనా... ఎందుకో తెలుసా?

చైనా అంటే ఇన్నాళ్లూ దాని చుట్టూ నిర్మితమైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' మాత్రమే గుర్తొచ్చేంది. ఇప్పుడు మరో గ్రేట్ వాల్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు చైనీయులు. వారి సంస్కృతిని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా, అలాగే చైనాలోని ఇంటర్నెట్ వినియోగదారులు విదేశాల ప్ర

వికీపీడియా, బ్రిటానికాలను తలదన్నే ఎన్‌సైక్లోపీడియా తయారీలో చైనా... ఎందుకో తెలుసా?
, బుధవారం, 3 మే 2017 (17:38 IST)
చైనా అంటే ఇన్నాళ్లూ దాని చుట్టూ నిర్మితమైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' మాత్రమే గుర్తొచ్చేంది. ఇప్పుడు మరో గ్రేట్ వాల్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు చైనీయులు. వారి సంస్కృతిని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా, అలాగే చైనాలోని ఇంటర్నెట్ వినియోగదారులు విదేశాల ప్రభావాలకు లోనుకాకుండా అరికట్టేలా 'కల్చరల్ గ్రేట్ వాల్'ను రూపొందిస్తున్నారు. 
 
ప్రజల ఆలోచనలకు సరైన దిశానిర్దేశం చేసేలా స్వంత ఎన్‌సైక్లోపీడియా చేస్తున్నామన్నారు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ యాంగ్ ముజి. పలువురు వాలంటీర్ల నుండి నిరంతరం మార్పుచేర్పులకు లోనవుతుండే వికీపీడియాను, అలానే బ్రిటన్‌కు చెందిన ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాపై పోటీదారులుగా పేర్కొన్న ఆయన చైనా పబ్లిషింగ్ గ్రూప్ నేతృత్వంలోని తమ ఎన్‌సైక్లోపీడియా ఈ రెండింటినీ మించిపోతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. 
 
చైనాలో ఇప్పటివరకు సుమారు 700 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. 2015లో అమెరికా విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. అత్యంత కఠినమైన ఆన్‌లైన్ వినియోగ విధానాలు ఉన్న 65 దేశాల్లో చైనా కూడా ఒకటి. వెబ్ సెన్సారింగ్‌ను 'ది గ్రేట్ ఫైర్‌వాల్'గా పిలుచుకునే చైనా జాతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమని వాదిస్తోంది. ఎంతో కఠినమైన నియంత్రణలను బైపాస్ చేయగలిగే ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉంటే తప్ప చైనాలో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను యాక్సెస్ చేయలేరు. ఇలాంటి ఎన్నో కఠినమైన విధానాలకు జూన్ 1 నుండి మరొకటి జోడిస్తోంది చైనా. అదేంటంటే, ఆన్‌లైన్‌లో వార్తలను చదివేటప్పుడు వినియోగదారులు తమ అసలు పేర్లను అందించవలసి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారిపోయిన ప్రేమ జంట వివరాలు చెప్పాలని ముస్లింను కొట్టి చంపిన హిందు యువ వాహని కేడర్