Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతున్నాయట.. కస్టమర్లకు సామ్‌సంగ్ వినతి

గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతున్నాయట. ఈ విషయాన్ని ఆ ఫోన్ల ఉత్పత్తి కంపెనీ సామ్‌సంగ్ స్వయంగా ప్రకటించింది. అందువల్ల ఈ ఫోన్లను వాడే కస్టమర్లు తక్షణం వాటి వినియోగాన్ని నిలిపివేయాలని కోరింది.

Advertiesment
Samsung
, సోమవారం, 12 సెప్టెంబరు 2016 (10:14 IST)
గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతున్నాయట. ఈ విషయాన్ని ఆ ఫోన్ల ఉత్పత్తి కంపెనీ సామ్‌సంగ్ స్వయంగా ప్రకటించింది. అందువల్ల ఈ ఫోన్లను వాడే కస్టమర్లు తక్షణం వాటి వినియోగాన్ని నిలిపివేయాలని కోరింది. తమ వద్ద ఉన్న ఫోన్లను వీలైనంత త్వరగా మార్చుకోవాలని పేర్కొంది. ఇప్పటికే మార్కెట్లోకి పంపిన ఫోన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు కంపెనీ ప్రకటించింది.
 
అయితే కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని నోట్‌ 7 ఫోన్లను వినియోగించవద్దని కంపెనీ పేర్కొంది. కాగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు విమానంలో ప్రయాణికులు గెలాక్సీ నోట్‌ 7ను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాత నోట్‌ 7 స్థానంలో కొత్త ఫోన్‌ను ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేశామని, దీన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని సామ్‌సంగ్‌ మొబైల్‌ ప్రెసిడెంట్‌ డాంగ్‌ జిన్‌ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీటర్‌ను భార్య ఎక్కువ సేపు వాడిందనీ... వివస్త్రను చేసి కొట్టిన వైనం.. భర్త పైశాచికత్వం...