Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శామ్‌సంగ్ చీఫ్ లీ జే యాంగ్‌కు కష్టాలు.. యావజ్జీవ జైలుశిక్ష తప్పదా?

శామ్‌సంగ్ చీఫ్ లీ జే యాంగ్‌కు కష్టాలు తప్పేలా లేవు. విదేశాల్లోని తన ఆస్తుల వివరాలను బయటపెట్టకుండా దాచాడనే ఆరోపణతో పాటు నిధుల దుర్వినియోగం, లంచం, అవినీతి ఆరోపణలపై ఈ నెల 17వ తేదీన సియోల్ పోలీసులచే అరెస్

Advertiesment
Samsung
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (15:03 IST)
శామ్‌సంగ్ చీఫ్ లీ జే యాంగ్‌కు కష్టాలు తప్పేలా లేవు. విదేశాల్లోని తన ఆస్తుల వివరాలను బయటపెట్టకుండా దాచాడనే ఆరోపణతో పాటు నిధుల దుర్వినియోగం, లంచం, అవినీతి ఆరోపణలపై ఈ నెల 17వ తేదీన సియోల్ పోలీసులచే అరెస్టయిన యాంగ్‌కు యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ప్రభుత్వం నుంచి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం యాంగ్.. ప్రెసిడెంట్ పార్క్ జ్యుకి.. ఆమె స్నేహితుడికి పెద్ద మొత్తాన్ని లంచంగా ఇవ్వజూపారని.. అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆయనను అభిశంసించడానికి స్పెషల్ ప్రాసిక్యూటర్లు సిద్ధమైపోయారు. ఇప్పటికే పార్క్‌ను గత డిసెంబరులోనే దక్షిణ కొరియా పార్లమెంట్ తప్పుబట్టింది. ఆమె అధికారాలు.. డ్యూటీలను రద్దు చేశారు.
 
లీతో పాటు మరో నలుగురు ఎగ్జిక్యూటి‌వ్‌లపై ఆరోపణలను నమోదు చేయనుంది. అరెస్ట్ వారెంట్ నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన శాంసంగ్ వారసుడైన లీ అరెస్ట్ కాక తప్పలేదు. ఇంకా కేసులు సైతం స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆయనకు మరింత చిక్కులు తప్పేలా లేవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డింపుల్ దెబ్బకు అఖిలేష్ చాలడంలేదా...? భాజపా, బీఎస్పీ నాకౌట్..?