దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. హనుమాన్ పేరుతో చాట్ బోట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనిమిది విశ్వవిద్యాలయాలతో భారత్ పీటీ పేరుతో ఒక కన్సార్టియంగా ఏర్పాటయ్యాయి. చాట్ జీపీటీ తరహా సేవలను 'హనూమాన్' పేరుతో, వచ్చే నెలలో ఈ కన్సార్టియం ఆవిష్కరించనుందని తెలుస్తోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఓ టెక్ సదస్సులో హనూమాన్ సారాంశాన్ని (స్నీక్ పీక్) కన్సార్టియం ప్రదర్శించింది. ఇందులో తమిళనాడులోని ఒక మోటార్ మెకానిక్, ఏఐ బాట్‍లో తన సందేహాలను తీర్చుకోవడం, ఒక బ్యాంకర్ హిందీ టూల్‌ను వాడుకోవడం, హైదరాబాద్ నగరానికి చెందిన ఒక డెవలపర్ కంప్యూటర్ కోడ్‌ను రాయడానికి దీనిని ఉపయోగించుకోవడం వంటి దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
'హనూమాన్' మోడల్ విజయవంతమైతే 11 భాషల్లో నాలుగు ప్రధాన రంగాల్లో(ఆరోగ్య రంగం, పాలన, ఆర్థిక సేవలు, విద్య) ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. ఐఐటీల భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేసిన ఈ మోడల్‌కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచాయి.
కాగా, ఈ చాట్‌బోట్ అందుబాటులోకి వస్తే ఓపెన్ఏఐ వంటి కంపెనీలు అందించే భారీ స్థాయి సేవలు కాకుండా చిన్న వ్యాపారులు, ప్రభుత్వ విభాగాలకు అందుబాటులో ఉండే సరళతర మోడళ్లు 'హనూమాన్'లో ఉంటాయి. దేశంలోనే తొలి ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంలో రానున్న 'హనూమాన్' ద్వారా మాటలను అక్షరాల్లోకి మార్చే సదుపాయం ఉంటుంది.