Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో యానివర్శరీ ఆఫర్.. రూ.500కే 4జీ ఫోన్... నిజమా?

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేసే దిశగా పయనిస్తోంది. దేశంలో జియో సేవలు ప్రారంభమై ఈనెల 21వ తేదీతో ఒక యేడాది పూర్తికానున్న సందర్భంగా జియో

Advertiesment
జియో యానివర్శరీ ఆఫర్.. రూ.500కే 4జీ ఫోన్... నిజమా?
, గురువారం, 20 జులై 2017 (09:01 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేసే దిశగా పయనిస్తోంది. దేశంలో జియో సేవలు ప్రారంభమై ఈనెల 21వ తేదీతో ఒక యేడాది పూర్తికానున్న సందర్భంగా జియో యానివర్శరీ ఆఫర్ పేరుతో వినియోగదారులకు ఆఫర్లు ఇవ్వనుంది. ఇందులోభాగంగా, రూ.500కే 4జీ టెక్నాలజీతో కూడిన ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అలాగే, సరికొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. 
 
ధన్‌ ధనాధన్ ఆఫర్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రూ.349, రూ.399తో రెండు ప్లాన్లు ప్రకటించిన జియో 21న జరగనున్న సమావేశంలో రూ.80 - రూ.90 మధ్యలో ఉండే మరో ప్లాన్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే ఈ ప్లాన్ పాత వినియోగదారులకా? లేక కొత్తగా రాబోతున్న 4జీ ఫీచర్ ఫోన్‌కా? అన్న విషయంలో స్పష్టత లేదు. 
 
వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్, టీవీ సేవలను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇప్పటికే పలు నగరాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. ఈ కనెక్షన్‌తో 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటాను మూడు నెలలపాటు ఫ్రీగా అందించనున్నారు. అయితే ఈ సేవలు పొందాలంటే తొలుత రూ.4500 డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. 
 
కాగా, ఈనెల 21న జరగనున్న ఆ సంస్థ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ ఆఫర్లపై ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రత్యర్థి కంపెనీలకు ఇప్పటి నుంచే కంటిమీద కునుకులేకుండా పోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునుగుతున్న జింకను కాపాడింది. ఒకే.. సపర్యలు కూడా చేస్తే.. దాన్ని ఏమని పిలవాలి?