జియోకు వంతపాడుతున్న ట్రాయ్.. నష్టానికి నష్టం.. నెట్‌వర్క్‌కు దెబ్బ: ఎయిర్‌టెల్
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోపై టెలికామ్ సంస్థలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఉచితం పేరిట జియో ఇష్టానుసారం వ్యవహరిస్తుందని భారతీ ఎయిర్‌టెల్ ఫైర్ అయ్యింది. ఉచిత ఆఫర్‌తో ఇతర
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోపై టెలికామ్ సంస్థలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఉచితం పేరిట జియో ఇష్టానుసారం వ్యవహరిస్తుందని భారతీ ఎయిర్‌టెల్ ఫైర్ అయ్యింది. ఉచిత ఆఫర్‌తో ఇతర నెట్‌వర్క్ కంపెనీల నడ్డివిరుస్తున్న రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా భారతీ ఎయిర్‌టెల్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది.
మూడు నెలల పాటు వెల్ కమ్ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా ఉచిత ఆఫర్ కొనసాగింపుకు ఎలా అనుమతి ఇచ్చారని ట్రాయ్‌ని ఎయిర్‌టెల్ నిలదీసింది. ఈ మేరకు టెలికం వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న రిలయన్స్ జియోకు ట్రాయ్ వంతపాడుతోందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. ట్రాయ్ ఆదేశాల ఉల్లంఘన కారణంగా తాము ప్రతి రోజు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఎయిర్‌టెల్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఉచిత కాల్స్ వల్ల పెరిగిన ట్రాఫిక్‌తో తమ నెట్‌వర్క్ దెబ్బతింటోందని, అందుకే ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని వివరించింది. అంతేగాకుండా జియో ఉచిత వాయిస్, డేటా సేవలను ఇక ముందు కొనసాగించకుండా ఆదేశాలు జారీ చేయాలని ట్రైబ్యునల్‌ను కోరింది.