Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

నాలుగు ప్లాన్లను తొలగించిన జియో.. 4జీ ఫీచర్ ఫోన్లకు మాత్రమే..?

Advertiesment
Reliance Jio
, ఆదివారం, 17 జనవరి 2021 (17:41 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ఆపై కొత్త కొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో.. తాజాగా జియో నాలుగు ప్లాన్లను తొలగించింది. రిలయన్స్ జియో రూ.99, రూ.153, రూ.297, రూ.594 గల జియోఫోన్ ప్లాన్‌ ధరలను తొలగించింది. కేవలం ఈ ఆఫర్ జియోఫోన్ 4జీ ఫీచర్ ఫోన్‌లు వినియోగిస్తున్న యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని గతంలో పేర్కొంది. 
 
అయితే మిగతా ప్లాన్ విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదని సంస్థ పేర్కొంది. దీంతో పాటు ఐయూసీ చార్జీల నుంచి ఊరట కలిగించడానికి తమ వినియోగదారులకు 500 నాన్ జియో ఉచిత నిమిషాలను అందిస్తుంది. 
 
వీటితో పాటు ఈ ఉచిత నిమిషాలు అయిపోయాక ఐయూసీ రీచార్జ్‌లు చేసుకోవడం ద్వారా ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ.75, రూ.125, రూ.155, రూ.185 అనే నాలుగు జియోఫోన్ ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గబ్బిలాలు కుట్టాయి.. ఆస్పత్రిలో చేరిన సైంటిస్ట్.. కరోనా వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా?