Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్-జియో నుంచి ఫోన్ చేస్తే ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్స్‌ కలవడం లేదని కలవరం..

భారత పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కంపెనీ ప్రవేశపెట్టిన ఆర్-జియో ఫోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ సేవలు వినియోగదారులకు నిద్రలేని రాత్రులనే మిగుల్చుతున్నాయి. ఎంతో ఆత్రు

Advertiesment
ఆర్-జియో నుంచి ఫోన్ చేస్తే ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్స్‌ కలవడం లేదని కలవరం..
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (08:27 IST)
భారత పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కంపెనీ ప్రవేశపెట్టిన ఆర్-జియో ఫోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ సేవలు వినియోగదారులకు నిద్రలేని రాత్రులనే మిగుల్చుతున్నాయి. ఎంతో ఆత్రుతతో జియో సిమ్‌ తీసుకున్నా కాల్స్‌ కలవడం లేదని ఎక్కువమంది వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. 
 
ప్రస్తుతం ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడియా నెట్‌వర్క్‌లకు కాల్‌చేస్తే ఆయా ఆపరేటర్లు సహకరించడక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని త్వరలోనే ఈ సమస్య పరిష్కారమ వుతుందని జియో ప్రతనిధులు చెబుతున్నారు. ఆ మూడు నెట్‌వర్క్‌లకు కలవాలంటే నాలుగైదు సార్లు చేయాల్సి వస్తుంది మినిహా మిగతా నెట్‌వర్క్‌లకు మాత్రం వెంటనే కలుస్తోందని చెబుతున్నారు. 
 
నిజానికి జియో నెట్‌వర్క్‌ విడుదలకు ఎప్పుడో సిద్ధంగానే ఉంది. 2015 ద్వితీయార్థంలోనే విస్తరించింది. ఆ ఏడాది చివరి నాటి సిగ్నల్‌ కూడా విడుదల చేసింది. కాని ఆశించిన స్థాయిలో వోల్టీ పరిజ్ఞానం ఉన్న మొబైల్స్‌ మార్కెట్‌లో లేకపోవడంతో మొబైళ్ల సంఖ్య పెరిగేందుకే సంస్థ ప్రస్తుతం దృష్టిసారించింది. దాని కోసం సొంతంగా లైఫ్‌ మొబైళ్లు విడుదల చేసింది. ఇతర మొబైల్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వోల్టీ ఎనేబుల్‌ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేలా చేయగలిగారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నాకు దక్కకపోతే నువ్వూ బతకడానికి వీల్లేదు'... తాను విషం తాగి.. ప్రేయసిపై హత్యాయత్నం