Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలయన్స్ Jio సిమ్ పనిచేయడం లేదా...? ఇలా చేస్తే సరి...

రిలయన్స్ Jio సిమ్ ఫోనులో వేసుకుని అది పనిచేయక చాలామంది అసంతృప్తికి, అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వారం నుంచి జియో సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ఐతే రోల్ అవుట్ ప్రాసెస్ పట్ల జియో సిమ్ సొంతం చేసుకు

Advertiesment
రిలయన్స్ Jio సిమ్ పనిచేయడం లేదా...? ఇలా చేస్తే సరి...
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (19:05 IST)
రిలయన్స్ Jio సిమ్ ఫోనులో వేసుకుని అది పనిచేయక చాలామంది అసంతృప్తికి, అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వారం నుంచి జియో సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ఐతే రోల్ అవుట్ ప్రాసెస్ పట్ల జియో సిమ్ సొంతం చేసుకున్న కొందరు యూజర్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అదేమంటే, వారి ఫోన్లలో జియో సిమ్ సెట్ కాకుండా పని చేయకుండా ఉండటమే. 
 
సిమ్ ఇన్స్టలేషన్ ప్రక్రియ సరిగా చేసుకోకపోవడంతోపాటు 2జి, 3జి నెట్వర్కులకు మాత్రమే సెట్ అయ్యే ఫోన్ జియో 4జికి సెట్ కాకపోవడం ఓ కారణం. అందువల్ల డివైస్ 4జి సపోర్టు చేస్తుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ అది సపోర్ట్ చేయకుండా అందులో జియో పనిచేయదు. ఇకపోతే మై జియో యాప్‌ను మీ ఫోనులో ఇన్‌స్టాల్ చేసుకుంటే జియో సేవలు అందుబాటులోకి వస్తాయి. 
 
ఇలా చేసినప్పటికీ సమస్య ఎదురవుతుంటే మీ ఫోనును అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్‌గ్రేడ్ చేయని ఫోనులో జియో వర్క్ చేయదని గమనించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కావేరీ జలాలపై ఆందోళనలొద్దు.. సంయమనం పాటించండి.. రాష్ట్రాలదే బాధ్యత: సుప్రీం