Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మడతపెడితే ఐఫోన్.. తెరిస్తే గన్.. ఐఫోన్ వంటి 9ఎమ్ఎమ్ డబుల్ బ్యారెల్ గన్.. అవసరమా?

ఐఫోన్ వంటి 9ఎమ్ఎమ్ డబుల్ బ్యారెల్ గన్ వస్తోంది. అచ్చు ఐఫోన్‌లా కనిపించే.. ఈ గన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా మడతపెట్టి పాకెట్లో పెట్టుకోవచ్చు. బ్రిటన్‌లో ఇలాంటి గన్స్ కావాలని అప్పుడే ఆర్డర్లు చేసే

Advertiesment
Police
, శుక్రవారం, 13 జనవరి 2017 (12:56 IST)
ఐఫోన్ వంటి 9ఎమ్ఎమ్ డబుల్ బ్యారెల్ గన్ వస్తోంది. అచ్చు ఐఫోన్‌లా కనిపించే.. ఈ గన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా మడతపెట్టి పాకెట్లో పెట్టుకోవచ్చు. బ్రిటన్‌లో ఇలాంటి గన్స్ కావాలని అప్పుడే ఆర్డర్లు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. కానీ బ్రిటన్ నుంచి అమెరికాకు ఇవి స్మగుల్ అయి అమ్మకానికి పెడితే చాలా డేంజర్ అని, క్రిమినల్స్ వీటిని సంపాదించి హింసకు పాల్పడవచ్చునని భావించిన అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
ఈ గన్ ప్రచారంలోకి రాగానే 12 వేల ప్రీ-ఆర్డర్స్ వచ్చేశాయట. ఒక బటన్ ప్రెస్ చేయగానే ఈ ఐ-ఫోన్ గన్‌లా మారిపోతుంది. ఐ-ఫోన్ 7 ధరతో పోలిస్తే దీని ధర సగమేనంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ వెపన్ దుండగుల చేతిలో పడకుండా.. బ్రిటన్, యూఎస్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
కేవలం ఒక్క బటన్ ఒత్తితే చాలు.. ఇది తెరుచుకుని, ట్రిగ్గర్ బయటపడుతుంది. దీంతో ఉగ్రవాదులు, నేరస్తులు సులభంగా దీన్ని ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. యూరోపియన్ నేరగాళ్లు దీన్ని అతితక్కువ సమయంలోనే తెప్పిస్తారని అధికారులు చెప్తున్నారు. దీని ధర కూడా కేవలం రూ. 28వేల లోపే ఉండటం, అది దాదాపుగా ఐఫోన్ 7 ధరకు సమానంగా ఉండటంతో మరింత క్రేజ్ పుట్టిస్తోంది. 
 
ఇటీవలి కాలంలో యూరోపియన్ దేశాల్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. దాంతో అక్కడి పోలీసులు మరింత అప్రమత్తం అవుతున్నారు. ఈ గన్ గురించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు యూరోపియన్ మార్కెట్లలో కనిపించకపోయినా, అది రావడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చని అంటున్నారు.
 
మామూలుగా చూస్తే దీన్ని ఫోన్ కాదని ఎవరూ చెప్పలేరని బెల్జియం పోలీసులు అంటున్నారు. చాలామంది వద్ద ఐఫోన్లు, ఇలాంటి స్మార్ట్ ఫోన్లు ఉంటుండటంతో అందరినీ తనిఖీ చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ తాత రాజారెడ్డి ఉసురు తీసింది చంద్రబాబే.. కడపతో సంబంధం లేని వారితో తిట్టిస్తారా?