Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒప్పో ఇండియా ఎఫ్‌ -19 ప్రో సిరీస్‌ అదుర్స్.. రికార్డు స్థాయి ఆర్డర్లు

Advertiesment
Oppo F19 Pro Review
, సోమవారం, 22 మార్చి 2021 (17:15 IST)
ఒప్పో ఇండియా నుంచి ఎఫ్‌ 19 ప్రో సిరీస్‌ అమ్మకాల్లో అదరగొట్టింది. రికార్డు స్థాయి ఆర్డర్లను పొందడం ద్వారా నూతన మైలురాయిని సృష్టించింది. ఈ ఉపకరణం తమ ముందు తరం నాటి ఫోన్ల అమ్మకాల రికార్డులన్నీ చెరిపేస్తూ తొలి రోజు అమ్మకాల పరంగా 70శాతం వృద్ధిని గత సంవత్సరపు వెర్షన్‌ ఎఫ్‌ 17 ప్రో అమ్మకాల వాల్యూమ్స్‌ పరంగా సరిపోల్చినప్పుడు నమోదు చేసింది. ఒప్పో ఎఫ్‌ 19 ప్రో+5జీ ఈ ఎఫ్‌ సిరీస్‌లో మొట్టమొదటి 5జీ వేరియంట్ ఫోన్.

వీడియో, బ్యాటరీ, గేమింగ్‌ అనుభవాల పరంగా వినూత్నమైన, అత్యాధునిక ఫీచర్లను కలిగిన ఈ ఉపకరణం ఎఫ్‌ సిరీస్‌ ఫ్యాన్‌ క్లబ్‌ నడుమ ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. అహ్మదాబాద్‌, ముంబై, తమిళనాడులలో ఈ సిరీస్‌కు గరిష్ట డిమాండ్‌ ప్రీ బుకింగ్‌ ఆర్డర్‌ రోజులలో కనిపించడంతో పాటుగా తొలి రోజు అమ్మకాల పరంగా కూడా కనిపించింది.

రెండు వేరియంట్లు - ఎఫ్‌ 19 ప్రో+5జీ మరియు ఎఫ్‌ 19 ప్రోలో ఎఫ్‌ 19 ప్రో+5జీకి వినియోగదారుల నుంచి అమితాదరణ లభించింది. భారతదేశంలోని మేట్రోయేతర నగరాల నుంచి ఎఫ్‌19 ప్రో+5జీకి గరిష్ట డిమాండ్‌ను కంపెనీ అందుకుంది. ఈ సిరీస్‌లోని ఉపకరణాలు ఎలాంటి క్లిష్టత లేకుండా జీవనశైలికి సరిగ్గా సరిపోవడంతో పాటుగా మునివేళ్లపై ప్రపంచంలో అత్యుత్తమ సృజనాత్మక తరంతో పాటుగా ట్రెండ్‌సెట్టర్లను సైతం సమూలంగా మార్చివేసే ఫీచర్లనూ తీసుకువస్తుంది.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌ను 200 ఏళ్లు పాలించిన అమెరికా, హేయ్... మళ్లీ వేసేశారుగా ఉత్తరాఖండ్ సీఎం