Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజంతా బ్యాటరీ బ్యాకప్‌‌తో వన్ ప్లస్ నార్డ్ ఎన్100 ఫోన్.. ఫీచర్స్ ఇవే

రోజంతా బ్యాటరీ బ్యాకప్‌‌తో వన్ ప్లస్ నార్డ్ ఎన్100 ఫోన్.. ఫీచర్స్ ఇవే
, సోమవారం, 29 మార్చి 2021 (11:38 IST)
Nord N10 5G
వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్‌ను 2021 సంవత్సరానికి గానూ ఉత్తమ బడ్జెట్ ఫోన్‌గా కన్స్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ ప్రకటించింది. రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను ఇచ్చే ఉత్తమ స్మార్ట్ ఫోన్‌గా వన్ ప్లస్ నార్డ్ ఎన్100ని ఈ కంపెనీ ప్రకటించింది. 
 
వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా పరిశోధన చేసే అమెరికన్ సంస్థ ఈ కన్స్యూమర్ రిపోర్ట్స్. అయితే సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ల తరహాలో ఈ ఫోన్లకు రెండు సంవత్సరాల పాటు అప్ డేట్లు అందించబోవడం లేదు. 
 
అయితే ఈ రెండు ఫోన్లూ మనదేశంలో మాత్రం అందుబాటులో లేవు. ఈ కంపెనీ జరిపిన పరీక్షలో వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ బ్యాటరీ ఏకంగా 41.5 గంటల పాటు పనిచేసింది. వాటర్ రెసిస్టెంట్ డిజైన్ లేకపోవడాన్ని కూడా ఈ రిపోర్ట్ హైలెట్ చేసింది. 
 
వన్ ప్లస్ నార్డ్ ఎన్100 బ్యాటరీ అయితే ఏకంగా 48.5 గంటల సేపు వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాల విషయంలో వెనకపడింది. ఈ విషయాన్ని 9టు5 గూగుల్ మొదట తెలిపింది. అయితే సాఫ్ట్ వేర్ సపోర్ట్ గురించి ఇందులో ఏమీ పేర్కొనలేదు.
 
ఫోన్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌తో పాటు అది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయ్యాయి. కేవలం ఆండ్రాయిడ్ 11 వరకు మాత్రమే ఇవి అప్ గ్రేడ్ అవుతాయి. అయితే ఈ వన్ ప్లస్ ఫోన్లకు సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్లు ఎప్పటివరకు వస్తాయో తెలియరాలేదు.
 
ఫీచర్స్.. 
వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ, వన్ ప్లస్ నార్డ్ ఎన్100కు 2021 ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ లభించింది. 
6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌, 
 
ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10.5పై ఈ ఫోన్ పనిచేయనుంది. 
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్‌గా ఉంది.
 
సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉంది.
 
ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా వైరస్ సోకిన స్కూల్స్, కాలేజీలు మూసివేత