Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై అంత సులభంగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఆ పని చేయలేరు?

Advertiesment
ఇకపై అంత సులభంగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఆ పని చేయలేరు?
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:36 IST)
భారతదేశంలో ప్రముఖ మొబైల్ మెసెంజర్ సర్వీస్ వాట్సాప్ నంబర్ వన్‌లో ఉంది. అయితే దీని వల్ల కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వినియోగదారు అనుమతి లేకుండా వారిని ఏ గ్రూపులో అయినా యాడ్ చేసే సౌలభ్యం ఉంది.


దీనితో తమకు సంబంధంలేని గ్రూపుల్లో చేరి ఆ గ్రూపుల నుంచి వరదలా వచ్చిపడుతున్న మెసేజ్‌ల బెడదతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకు సమాధానంగా వాట్సాప్ సరికొత్త అప్‌డేట్ వినియోగదారుల అనుమతి లేకుండా ఇతరులు గ్రూపుల్లో యాడ్ చేయడాన్ని నిలిపి వేస్తుంది. 
 
వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈరోజు నుంచే వాట్సాప్ ఈ ఫీచర్ అప్‌డేట్‌ని కొందరు వినియోగదారులకు విడుదల చేయనుంది. రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ సౌకర్యం లభించనుంది. వాట్సాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఈ ఫీచర్ ఉందో లేదో మీరే స్వయంగా తెలుసుకొనవచ్చు.
 
వాట్సాప్ ఈ కొత్త వెర్షన్‌లో గ్రూపుల కోసం ప్రైవసీ విభాగాన్ని జోడించింది. సెట్టింగ్స్ మెనూలో అకౌంట్-ప్రైవసీ-గ్రూప్స్ ఎంపికకు వెళ్లి దీనిని చూడవచ్చు. గ్రూపుల కింద వినియోగదారులు నోబడీ, మై కాంటాక్ట్స్, ఎవ్రీవన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు. మై కాంటాక్ట్స్ ఎంపికను ఎంచుకుంటే వినియోగదారుల కాంటాక్ట్  లిస్ట్‌లో ఉన్నవారు మాత్రమే వాట్సాప్ గ్రూపులో వినియోగదారుని జోడించగలరు.

ఎవ్రీవన్ ఎంచుకుంటే ఎవరైనా వినియోగదారుని వాట్సాప్ గ్రూప్‌లో జోడించగలరు. నోబడీ ఎంపికను ఎంచుకుంటే వినియోగదారుని ఎవరూ వాట్సాప్ గ్రూప్‌లో జోడించలేరు. ఏదైనా గ్రూపులో చేర్చబోతే ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించేందుకు వినియోగదారుకు వాట్సాప్ మూడు రోజుల గడువు ఇస్తుంది. ఆ తర్వాత దాని గడువు ముగుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పతనమవుతున్న బంగారం ధరలు.. వెండి ధర పైకి