ప్రముఖ చైనా యాప్స్‌పై నిషేధం విధించి ఏడాదికి పైగా సమయం గడుస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశం చైనా యాప్స్‌పై నిషేధాన్ని ఉపసంహరించుకుంటుందనే వార్తలు మొదలయ్యాయి.
లోక్‌సభలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చైనా యాప్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ యాప్స్ నిషేధాన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదన లేదని ఓ లిఖితపూర్వక పత్రం అందించారు.
దీంతో పబ్‌జీ, టిక్‌టాక్, విబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్, యూసీ బ్రౌజర్ వంటి అప్లికేషన్లు ఇప్పట్లో ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. 2020, జులై 29న 59 యాప్‌లు, సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను, నవంబరులో 43 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 69-ఏ కింద బ్యాన్ విధించినట్లు అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో చైనా దేశం చాలా నష్టపోయిన సంగతి తెలిసిందే.