ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటుకిరానుంది. సాధారణంగా యూజర్లు తమ రియాక్షన్ తెలపడానికి ఎమోజీలు ఉపయోగిస్తారు. మనం మాటల్లో చెప్పలేని అనేక విషయాలను ఎమోజీల ద్వారా భావవ్యక్తీకరణ చేస్తుంటారు. ఇలాంటి వెసులుబాటి ఇప్పటివరకు వాట్సాప్ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్‌లు ఇస్తున్న ఎమోజీలు మాత్రమే యూజర్లు వాడుతున్నారు. ఇకపై వాట్సాప్ తన యూజర్లకు సొతంగా ఎమోజీలు అందుబాటులోకి తీసుకునిరానుంది.
టెలిగ్రామ్ యాప్‌లో మాదిరిగా యానిమేటెడ్ ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ యానిమేటెడ్ ఎమోజీలను లొట్టి లైబ్రరీ సాయంతో తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎమోజీలతో యూజర్లు సరికొత్త మేసేజింగ్ అనుభవం లభిస్తుందని ట్విట్టర్ అంచనా వేస్తుంది. అయితే, ఈ కొత్త ఫీచర్ యూజర్లను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సివుంది.